నేడు ఎమ్మెల్సీ కవిత దీక్ష: 18పార్టీలు సంఘీభావం; హస్తినలో కేంద్రంపై కేసీఆర్ తనయ సమరశంఖం!!
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర నేడు దీక్ష, ధర్నా నిర్వహిస్తున్నారు. కవిత ధర్నాకు 18 పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర నేడు దీక్ష, ధర్నా చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. నిన్న అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు కవిత దీక్షకు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దీక్ష
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. అలా ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ లభిస్తుందని కవిత చెబుతున్నారు. భారత జాగృతి సంస్థ ద్వారా ఈ ధర్నా నిర్వహిస్తున్న కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాదు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నేడు ముందుగానే ప్రకటించిన క్రమంలో ఢిల్లీలో దీక్ష, ధర్నా నిర్వహిస్తున్నారు.

కవితకు సంఘీభావం తెలిపిన 18 పార్టీలు
ఈ క్రమంలో నేడు కవిత నిర్వహించబోయే ధర్నాకు 18 పార్టీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించినట్టు ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈరోజు కవిత నిర్వహించబోయే దీక్షకు సిపిఐ, సిపిఎంతో పాటుగా సమాజ్వాది పార్టీ, డిఎంకె, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సిపి, టిఎంసి, శివసేన, జేడీయు, ఆర్జెడి, ఆర్ ఎల్ డి, జే యం యం, పీడిపి తో పాటు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించినట్టు వెల్లడించారు. ఈ నిరసన దీక్ష ద్వారా కవిత తమ బలాన్ని కేంద్రం ముందు ప్రదర్శించబోతున్నారు.

కవిత దీక్షను ప్రారంభించనున్న సీతారామ్ ఏచూరి, శివసేన నేత ప్రియాంక చతుర్వేది
ఈరోజు ఉదయం 10 గంటలకు కవిత ప్రారంభించే ఈ దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. కవిత ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న ఈ దీక్షలో పాల్గొనడానికి బీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఈరోజు వారంతా కవిత సారధ్యంలో ఉద్యమించనున్నారు. ఇక ఈరోజు కవిత ధర్నా దీక్షను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రారంభిస్తారని సమాచారం.

దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల మహిళలు ధర్నాలో పాల్గొనే అవకాశం
నేడు నిరాహార దీక్ష కొనసాగించే కవితతో సాయంత్రం సిపిఐ కార్యదర్శి డాక్టర్ డి. రాజా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తారు. ఇక దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి మహిళల కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరు ఈరోజు కవిత నిర్వహించే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసే ఈ దీక్షలో పాల్గొనే అవకాశం ఉందని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించాయి.

కవిత ధర్నాకు 5 వేల మంది.. నేడు సమరశంఖం పూరిస్తున్న కవిత
మొత్తంగా చూసినట్లయితే 5000 మంది ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం మెడలు వంచడానికి కవిత ధర్నాకు శ్రీకారం చుట్టిన వేళ ఢిల్లీ వేదిక ఏం జరగబోతుంది అన్నది మాత్రం తెలంగాణలో ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. ఒకపక్క కవితకు ఈడీ నోటీసులు, రేపు కవిత ఈడీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితులతో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా అంతా చూస్తుంటే కవిత మాత్రం దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అంటూ నేడు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం హస్తినలో పోరుబాట పట్టారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications