భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత.. కారణమిదే!!
ప్రముఖ ఫోక్ సింగర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే సాయి చంద్ మరణించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక సాయి చంద్ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక వారిని నేడు పరామర్శించడానికి వెళ్లారు ఎమ్మెల్సీ కవిత.
సాయి చంద్ భార్య కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితిని చూసి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీ కవితను చూడగానే సాయి చంద్ భార్య రజిని బోరున విలపించారు. సాయి చంద్ భార్యను ఓదార్చే క్రమంలో కవిత సైతం భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే సాయి చంద్ మరణించటం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత సైతం ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సాయి చంద్ తన పాటలతో ఎంతోమందిని చైతన్యవంతం చేశారు అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. చిన్న వయసులోనే మృత్యువాత పడడం కుటుంబానికి ఎంత బాధని కలిగిస్తుందో తాను అర్థం చేసుకోగలను అన్న కవిత సాయి చంద్ భార్యను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే సాయిచంద్ మరణం తర్వాత సాయి చంద్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
భర్త మరణాన్ని రజిని జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త కోసం గుండెలవిసేలా రోదిస్తున్నారు. రజనీకి మొన్న గుండె నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఆమె నీరసించి పోయారని అనంతరం ఒత్తిడి వల్ల గుండె నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ సాయిచంద్ సతీమణి రజిని భర్త కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.
సాయి చందు భార్యని చూడగానే భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత..!! #MLAKavitha #SaiChandu #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/PmrC0NcBc7
— oneindiatelugu (@oneindiatelugu) July 6, 2023
ఇక సాయి చంద్ కుమారుడు తండ్రిని మర్చిపోలేక తండ్రి కోసం రోదిస్తున్నాడు. తండ్రి పక్కన లేకుంటే నిద్రపోలేకపోతున్న సాయి చంద్ కుమారుడు తన దిండుకు తండ్రి చొక్కా తొడిగి పట్టుకొని పడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి పరిస్థితికి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి చంద్ మరణం తర్వాత సాయి చంద్ భార్య, కొడుకు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications