ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం; అప్పటివరకు అన్ని కార్యక్రమాలకు దూరం!!
భారతీయ రాష్ట్ర సమితి ఎం ఎల్ సి, భారత జాగృతి అధ్యక్షురాలు సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. తన కాలికి గాయం అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ట్విట్టర్లో ఈ మేరకు పోస్ట్ చేసిన కవిత "నా కాలికి గాయం అయింది. గాయం తీవ్రతతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది" అంటూ ట్వీట్ చేశారు.
ఇక తాజాగా కాలికి గాయం కావడంతో మూడు వారాలపాటు కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. గాయం కారణంగా కొన్ని రోజులు పాటు రాజకీయ సమావేశాలు, సభలకు ఎమ్మెల్సీ కవిత దూరంగా ఉండనున్నారు. అయితే నాయకులు, కార్యకర్తల కోసం తాను ఎప్పటికీ అందుబాటులో ఉంటానని చెబుతున్న కవిత జూమ్ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం అయింది అని తెలిసిన అనుచరులు, కవిత అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

ఇటీవల నిజామాబాద్ జిల్లాలో యాక్టివ్ రాజకీయాలలో ఉంటున్న కవిత నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిక్షణం ప్రజల్లోకి అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యక్రమాలను సైతం ముందుకు తీసుకు వెళుతున్నారు. ఇక తాజా కాలు ఫ్రాక్చర్ తో కవిత మూడు వారాల పాటు కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.












Click it and Unblock the Notifications