KCRను కలిసిన ఎమ్మెల్సీ కవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కవితకు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఆదివారం ఆమె స్టేట్మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో తన తండ్రిని కలిసేందుకు కవిత ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది.
సీబీఐ నోటీసులివ్వడంపై కవిత ఘాటుగా స్పందించారు. అరెస్ట్ చేసుకున్నా భయపడేది లేదన్నారు. జైల్లో పెడితే ఏమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల్లా తాము విచారణకు భయపడమని స్పష్టం చేశారు. తమను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

సీబీఐ విచారణను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేసీఆర్‌తో చర్చించడానికే కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారంటున్నారు. విచారణతో సీబీఐ సరిపెడుతుందా? లేక మరింత ముందుకెళుతుందా? అనేది ముందు ముందు తెలియబోతోంది. ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించడంపై బీజేపీ ఆగ్రహంగా వుంది. దీనికి బదులు తీర్చుకునేందుకే కవితపై లిక్కర్ స్కాం కేసులో దూకుడుగా వెళుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దక్షణాది రాష్ట్రాల్లో 144 ఎంపీ స్థానాలు సాధించాలనే లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. దీనిపై జరిగే సమావేశానికి అమిత్ షా, బీఎల్ సంతోష్ తోపాటు పలువురు కీలక నేతలు హైదరాబాద్ రాబోతున్నారు. ఈ సమయంలో సంతోష్ కు సిట్ ఏమైనా నోటీసులు జారీచేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు నుంచి సంతోష్ అనుమతి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications