Liquor Scame: ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు.. ఎమ్మెల్సీ కవిత..
తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. అయితే లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు చేసింది. హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 12 మందికి, 18 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
బోయిన్ పల్లి అభిషేక్ రావు
దీనిని కవిత ఖండించారు. ఈడీ శుక్రవారం ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలోని బుచ్చిబాబు నివాసంలో నలుగురు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. కవిత పీఏగా పనిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసింది.

బోయిన్ పల్లి అభిషేక్ రావు
నోటీలుసు అందుకున్న వారిలో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, బోయిన్ పల్లి అభిషేక్ రావు, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇతరులు ఉన్నారు. ఇండో స్పిరిట్, అరబిందో ఫార్మా, ప్రైమస్ ఎటర్ ప్రైసెస్ తో తదితర సంస్థలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, దోమలగూడలో తనిఖీలు నిర్వహించింది. పలు చోట్లు ఇంకా సోదాలు కొనసాగుతోన్నాయి.












Click it and Unblock the Notifications