బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో చూసెయ్యండి!!
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన కెసిఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. భారత జాగృతి అధ్యక్షురాలిగా కవిత ఎంతోకాలంగా తెలంగాణ సంస్కృతిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక బతుకమ్మ సంబరాలలో ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ మహిళలతో కలిసి ఆడి పాడి బతుకమ్మకు ఉన్న ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ రోజున మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ ఆడుకోవడానికి సరికొత్త పాటతో ఎమ్మెల్సీ కవిత సందడి చేస్తున్నారు.

ఈసారి బతుకమ్మ సందర్భంగా తయారుచేసిన కొత్త పాటలో కవిత తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మంచు మొగ్గలై మల్లెపొదల పూల ఏరుల్లో మనసందామావయ్య.. అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా.. ముసిముసి నవ్వులతో మురిసే పువ్వులు చూసి మురిసిండ్రో అంటూ సాగిన కొత్త బతుకమ్మ పాటలో ఎమ్మెల్సీ కవిత కూడా తన గొంతు కలిపారు.
యువతులతో కలిసి ఒక్కొక్క ముత్యం నే నోముకుందు.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ బతుకమ్మ సాంప్రదాయ పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. బతుకమ్మ పండుగ కోసం స్పెషల్ గా కంపోజ్ చేసిన ఈ బతుకమ్మ వీడియో ఒక సాంగ్ లో ఎమ్మెల్సీ కవిత పాట పాడడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈ వీడియోలో ఆమె యువతులతో కలిసి బతుకమ్మ పాట పాడడం మాత్రమే కాకుండా బతుకమ్మను పేరుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. భారత జాగృతి రిలీజ్ చేసిన ఈ పాట పల్లెటూరి వాతావరణాన్ని, సాంప్రదాయమైన కట్టుబాటులో తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ సంబరాలను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. బతుకమ్మ పండుగపై భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాడిన ఈ ప్రత్యేకమైన పాట పూర్తి వీడియోను నేడు రిలీజ్ చేశారు.












Click it and Unblock the Notifications