బిడ్డా ఎట్లున్నవ్.. కేసీఆర్ గొంతు వినగానే కవిత కన్నీటిపర్యంతం!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దాదాపు గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరగగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బయటకు వచ్చిన కవితను తండ్రి కెసిఆర్ ఫోన్లో పలకరించారు.
కేసీఆర్ గొంతు విని భావోద్వేగానికి గురైన కవిత
బిడ్డ.. ఎట్లున్నావ్ పాణం మంచిగున్నదా అంటూ కవితను కేసిఆర్ క్షేమ సమాచారం అడిగారు. మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చోగానే కవిత తన తండ్రి కెసిఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు అని సమాచారం. నాన్న అని పిలుస్తూ కవిత తన తండ్రి గొంతు విని భావోద్వేగానికి గురయ్యారు.

కన్నీటిపర్యంతం అయిన కుమార్తెని ఓదార్చిన కేసీఆర్
కాసేపటి దాకా కవిత నోటి వెంట మాటలు రాలేదని, తండ్రి గొంతు వినగానే ఒక్కసారిగా కవిత కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం. ఈ సందర్భంగా ఫోన్లో కుమార్తెతో మాట్లాడిన కెసిఆర్ కుమార్తెను ఓదార్చి బిడ్డ ఎట్లా ఉన్నావ్ .. పాణం మంచిగున్నదా అంటూ కుశల ప్రశ్నలు అడిగారు అంతేకాదు బాధపడకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ కేసీఆర్ కవితకు జాగ్రత్తలు చెప్పారు.
నేడు హైదరాబాద్ కు కవిత రాక... వెంటనే తండ్రి వద్దకు
కవిత కూడా కేసీఆర్ ను మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారా? అంటూ కుశల ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఇక తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత నిన్నరాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నేడు మధ్యాహ్నం ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వెంటనే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు కవిత వెళ్లి తండ్రిని కలవనున్నారు.
ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులను కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. pic.twitter.com/jCyxeDAjTz
— BRS Party (@BRSparty) August 27, 2024
తండ్రీ కూతురి బాండింగ్
కవిత జైలు పాలు అయినప్పటి నుంచి బయటకు మాట్లాడుతున్నప్పటికీ తీవ్ర ఆవేదనలో ఉన్న కేసీఆర్ తన గుండెలో అగ్నిపర్వతాన్ని మోస్తున్నట్టు కవిత అరెస్టు విషయంలో స్పందించారు. తన బిడ్డ ఏ తప్పు చేయలేదని బల్లగుద్ది మరీ చెప్పారు. తాజాగా కవిత కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. నేను కేసీఆర్ బిడ్డను ఏ తప్పు చేయలేదు.. నేను మొండి దాన్ని నన్ను జైలుపాలు చేసి జగమొండిని చేశారు ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా పోరాటం చేసి తీరుతానని తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో తండ్రీ కూతురి మధ్య బాండింగ్ పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications