రూ.5 కోట్ల కారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడిది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రూ. 5 కోట్ల విలువైన కారు రిజిస్ట్రేషన్ అయింది. కోమటిరెడ్డి తనయుడు కార్తీకర్ రెడ్డి పేరున ఈ కారును శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ చేశారు.

సుమారు ఐదుకోట్ల విలువ చేసే ఫెరారే కారు ఖైరతాబాద్ ఆర్ టీ ఏ కార్యాలయంలోకి వెళ్ళలేదు.ఈ కారును రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ కార్యాలయానికి తీసుకు వచ్చారు.అయితే ఈ కార్యాలయంలోకి కారు వెళ్ళలేదు.

MLC Komatireddy Rajagopla Reddy son Kartik Reddy won a fancy number in auction

దీంతో ఏం వీ ఐ చంద్రశేఖర్ కార్యాలయం నుండి బయటకు వచ్చి కారు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ కారుకు ప్యాన్సీ నెంబర్ కోసం వేలం పాటలో పాల్గొన్నారు.

వేలం పాటలో సుమారు. రూ.1.98 లక్షలను వెచ్చించి ప్యాన్సీ నెంబర్ ను దక్కించుకొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబసభ్యులు.ఈ కారును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MLC Komatireddy Rajagopla Reddy son Kartik Reddy won a fancy number in auction on Friday. He spent around RS. 1.98 lakh for fancynumber his new Ferrari car worth Rs 5 crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి