త్వరలో హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్: తెలంగాణలో రైల్వేకు మహర్ధశ
రూ. 430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అమృత్ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ. 430 కోట్లతో చర్లపల్లి, రూ. 715 కోట్లతో సికింద్రాబాద్, రూ. 429 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతోపాటు అదనంగా చర్లపల్లిని నాలుగో నూతన రైల్వే స్టేషన్‌గా రాబోతోందన్నారు. దీని కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. రూ. 521 కోట్లతో కాజీపేటలో రైల్ మానిఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి(యాదగిరిగుట్ట) వరకు ఎంఎంటీఎస్ పొడిగించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలోనే చేపడతామని కిషన్ రెడ్డ్డి చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చి దిద్దుతున్నామన్నారు. ఈ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు అంకితం చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Once operational, Charlapalli Railway Station is expected to attract increased passenger footfall, serving as an alternate coaching rail terminal. This expansion, part of @narendramodi govt's commitment to enhancing rail infrastructure, will facilitate the introduction of new… pic.twitter.com/vziLglvThZ
— G Kishan Reddy (@kishanreddybjp) October 20, 2024
రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే కవచ్ వ్యవస్థను తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వందేభారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. త్వరలో వందేభారత్ ట్రైన్ లలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. 346 కిలోమీటర్ల మేర తెలంగాణలో రైల్వే లైన్లు నిర్మించామన్నారు. 369 కిలోమీటర్ల మీర సింగిల్, డబుల్ లైన్లు నిర్మించామని వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications