నాలుగురోజులు వర్షాలే... హెచ్చరిస్తున్న బంగాళాఖాతం.. ఐఎండీ అలెర్ట్!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8వ తేదీ వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరం వెంట ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం
అలాగే తూర్పు పశ్చిమ ద్రోణి తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ భాగాల నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక తమిళనాడు మీదుగా బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఎత్తుకు వెళ్లే కొద్దిగా దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది.

ఈ జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు
30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బుధవారం నాడు నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలకు అలెర్ట్
శుక్రవారం నల్గొండ నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications