హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెచ్‌సీయూలో ఉద్రిక్తత: పోటాపోటీగా ప్రదర్శనలు, భారీగా చేరుకున్న పోలీసులు

హెచ్‌సీయూలో ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ మరోసారి ప్రదర్శించడంతో ఏబీవీపీ ధర్నాకు దిగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హెచ్‌సీయూలో ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ మరోసారి ప్రదర్శించడంతో ఏబీవీపీ ధర్నాకు దిగింది. హెచ్‌సీయూలో డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను ఆపాలంటూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు.

బీబీసీ డాక్యుమెంటరీకి ప్రదర్శనకు నిరసనగా ఏబీవీపీ నార్త్ బ్లాక్‌లో కాశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ రెండు గ్రూప్‌ల హోరాహోరీ నినాదాలతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ-ఎస్ఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటో చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. చిత్రాలను ప్రదర్శిస్తున్న ప్రొజెక్టర్లను సీజ్ చేశారు.

modi bbc documentary screening at hcu: abvp and sfi leaders clash, tension situation

ప్రధాని మోడీపై ఇంటర్నేషనల్ మీడియా బీబీసీ తీసిన 'ఇండియా: ద మోడీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా డాక్యుమెంటరీ ఉందంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ డాక్యుమెంటరీని ఇండియాలో ప్రదర్శించవద్దని కేంద్రం ఇప్పటికే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మరికొన్ని యూనివర్సిటీలలోన ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించే యత్నాలు జరగడం గమనార్హం.

English summary
modi bbc documentary screening at hcu: abvp and sfi leaders clash, tension situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X