తెలంగాణ ఎన్నికల వేళ కేంద్రం మరో సంచలన నిర్ణయం..!?
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా మారుతున్న ఎన్నికల పోరును తమ వైపు టర్న్ చేసుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ నాయకత్వం..మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మారుతున్న లెక్కలు:తెలంగాణలో బీజేపీ సామాజిక సమీకరణాల కేంద్రంగా ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తోంది. ఇక, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలపనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సుముఖంగా ఉందని చెబుతున్నారు. ఈ డిమాండ్ పైన పలు పార్టీలు డిమాండ్ చేసాయి. ఎస్సీ వర్గీకరణ చేపట్టే దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రధాన పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపారు.

ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం..?:2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని నాడు కేసీఆర్ హామీ ఇచ్చిన అంశాన్ని బీజేపీ పలు మార్లు ప్రస్తావించింది. తాజాగా బీసీ సీఎం నినాదంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నాడు వాజ్ పేయ్ ప్రభుత్వ హయాం నుంచి నేటి వరకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రధాని మోదీ స్వయంగా ఎల్బీ స్టేడియం సభలో వివరించారు. బీసీ నినాదం కొంత మేర తమకు సానుకూలంగా మారిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ పైన సానుకుల నిర్ణయం కోసం న్యాయపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2018 మార్చి 14న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీ వర్గాల్లో చర్చ:ఎస్సీ వర్గీకరణ అంశంపై 2017 మార్చి 5న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ లేఖలు రాసారు. సుప్రీంకోర్టులో ఇబ్బందులు ఉండటంతో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వెంటపెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ ఇచ్చారు. అప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌లో తీర్మానం ఆమోదించారు. ఎస్సీల రిజర్వేషన్ కోటాను పెంచాలని, కుల గణన కూడా చేపట్టాలని 2021 అక్టోబర్ 5న అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ కోటాను 15 శాతానికి మించి పెంచాలని కోరారు. ఇక, ఇప్పడు ఈ అంశంలో కేంద్రం సానుకూలంగా ఉందనే ప్రచారం వేళ..ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications