మోడీ,కేసీఆర్ చీకటి రాజకీయ అక్రమ సంబంధం.!అందుకే సీఎం బెంగళూర్ ట్రిప్.!మరోసారి జగ్గారెడ్డి ఫైర్.!
హైదరాబాద్: బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ తో పాటు ప్రధాన మంత్రి మోదీ, సీఎం చంద్రశేఖర్ రావు లపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి చెలరేగిపోయారు. ప్రధాని నగరానికి వచ్చినప్పుడు తెలంగాణ పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్న మోడీ ని ఎందుకు ఇవ్వమని అడగలేదని బండి సంజయ్ ని నిలదీసారు. అంతే కాకుండా 2కోట్ల ఉద్యోగాల గురించి మోడీ ని ఎందుకు అడగలేదని, ఒక్కరోజు కూడా గుడికి వెళ్లని బండి సంజయ్ శివలింగాల మీద మత రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. మోదీ పర్యటన సందర్బంగా సీఎం చంద్రశేఖర్ రావు నగరంలో ఉంటే రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి నిలదీసేవారని, ఆ లాజిక్ సీఎం మిస్సయ్యారన్నారు జగ్గారెడ్డి.

స్టాలిన్ కు ఉన్న తెగింపు కేసీఆర్ కు లేదు..
అంతే కాకుండా మతాల పేరు తో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని, ప్రజలు ఇది గమనించాలన్నారు జగ్గారెడ్డి. తమిళనాడు సీఎం స్టాలిన్ మొగాడని, ప్రధానిని నిలదీసాడన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు అన్ని మతాలను,కులాలను గౌరవిస్తుందని, కాంగ్రెస్ పార్టీ మతాల పరంగా, కులాల పరంగా రాజకీయం చేయదన్నారు.
మోడీ -చంద్రశేఖర్ రావు కి చీకటి రాజకీయ అక్రమ సంబంధం ఉందని, అందుకే చంద్రశేఖర్ రావు బెంగళూర్ పారిపోయాడని జగ్గారెడ్డి ఎద్దేవా చేసారు.

హామీలపట్ల బీజేపి నేతలు మోదీని ఎందుకు నిలదీయలేదు..
ప్రధాని హోదా లో తెలంగాణ కు వచ్చిన మోడీ, ఎటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదన్నరు జగ్గారెడ్డి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని, తెలంగాణ సమస్య ప్రధాని దృష్టి కి ఎందుకు తీసుకెళ్ళలేదని నిలదీసారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏప్పుడైనా గుడికి వెళ్లారా అని,
బండి సంజయ్ వాఖ్యలు దేనికి సంకేతమన్నారు జగ్గారెడ్డి. బండి సంజయ్ ముస్లిం లను వేరు చేస్తూ, హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు ఆరోపణలు చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

ప్రధాని టూర్ కు కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు..
ప్రధాని ని నిలదిసే దమ్ము లేని బండి సంజయ్, మసీదు లను తవ్వుతానడం రెచ్చగొట్టడమేనని, కానీ కాంగ్రెస్ అలా కాదని, హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ బాగుండాలని కోరుకుంటుందన్నారు. చంద్రశేఖర్ రావు మోడీ ని, మోడీ ని చంద్రశేఖర్ రావు తిడితే ప్రజల కడుపు నిండుతదా?అని నిలదీసారు. ప్రాధాని రాకకు చంద్రశేఖర్ రావు ఎందుకు అటెండ్ కాలేదో స్పష్టత ఇవ్వాలపి, ప్రధాని కార్యక్రమానికి హాజరయ్యి ఉంటే రాష్ట్ర సమస్యలపై ప్రధానిని సీఎం నిలదిసేవారన్నారు జగ్గారెడ్డి.

దేశ రాజకీయాల్లో కేసీఆర్ విఫలం..
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దమ్మున్నోడని, ప్రజల ముందు ప్రధానిని నిలదీసిన వ్యక్తి స్టాలిన్ అని, ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలన్నారు జగ్గారెడ్డి.
స్టాలిన్ తాను తమిళంలో మాట్లాడుతా అంటూనే జీఏస్టీ నిధులు అడిగారని అన్నారు. రాష్ట్రంలో మోదీ, బెంగుళూరులో చంద్రశేఖర్ రావుల పర్యటన పరస్పర అవగాహనతోనే జరిగినట్టు ఉందన్నారు జగ్గారెడ్డి. మంత్రి మల్లారెడ్డికి రాజకీయాల్లో అవగాహన లేదన్నారు. చంద్రశేఖర్ రావు చాలా శుభవార్తలు చెప్తా అన్నారని, ఒక్కటి కడా చెప్పలేదన్నారు జగ్గారెడ్డి. దేశంలో కాంగ్రెస్,బీజేపీలను కాదని చంద్రశేఖర్ రావు ఏం చేయలేడని, దేశ రాజకీయాల్లో చంద్రశేఖర్ రావు విఫలం చెందారన్నారు జగ్గారెడ్డి.












Click it and Unblock the Notifications