ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కు పోటీగా మోడీ.. అప్పుడే తెలంగాణాలో ఎన్నికల వేడి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలలో కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారు ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ పై ఫోకస్ చేస్తున్న అగ్రనాయకులు తెలంగాణలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రయత్నాలు చేయడం, బహిరంగ సభలు ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి కొనసాగుతుంది. అప్పుడే తెలంగాణాలో ఎన్నికల వేడి కనిపిస్తుంది.

ఖమ్మం వేదికగా 5 లక్షల మందితో బీఆర్ఎస్ సభ

ఖమ్మం వేదికగా 5 లక్షల మందితో బీఆర్ఎస్ సభ

ఇక ఇప్పటికే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై స్థానిక నాయకులను పిలిపించుకొని సమీక్షించారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ ఖమ్మం పరిధిలో 5 లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని వారికి ఆదేశించారు. మూడు రాష్ట్రాల నుంచి సీఎంల ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న ఆయన సభకు పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మూడు లక్షలకు పైగా జనసమీకరణ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఖమ్మం సభతో బీఆర్ఎస్ అజెండా చెప్పనున్న కేసీఆర్ .. షాక్ ఇవ్వటానికి బీజేపీ ప్లాన్

ఖమ్మం సభతో బీఆర్ఎస్ అజెండా చెప్పనున్న కేసీఆర్ .. షాక్ ఇవ్వటానికి బీజేపీ ప్లాన్


ఖమ్మం సభకు నల్గొండ, మహబూబాబాద్ తో పాటు, ఏపీ సరిహద్దు జిల్లాల ప్రజలు కూడా వస్తారని భావిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల సీఎంలు ఆహ్వానం పంపిన కేసీఆర్ ఇద్దరు మాజీ సీఎం లను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సభలో బీఆర్ఎస్ అజెండా, పలు విధివిధానాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. ఇక ఈనెల 18వ తేదీన ఖమ్మం సభతో కెసిఆర్ సంచలనం సృష్టించాలని భావిస్తుంటే, అదే రోజు కెసిఆర్ కు షాక్ ఇవ్వడానికి బిజెపి రంగం సిద్ధం చేసింది. పెద్ద ఎత్తున ఖమ్మం నాయకులకు బీజేపీలోకి రెడ్ కార్పెట్ వేస్తుంది.

కేసీఆర్ సభ తర్వాత రోజే మోడీ పర్యటన

కేసీఆర్ సభ తర్వాత రోజే మోడీ పర్యటన

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని, కెసిఆర్ సభ నిర్వహించే ఖమ్మం జిల్లాలోని పలువురు కీలక నేతలను అదే రోజు బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఖమ్మంలో మొదటి నుండి బీఆర్ఎస్ లో ఉన్న వర్గపోరు నేపధ్యంలో కేసీఆర్ కు అదే రోజు కాషాయ దళం షాక్ ఇవ్వటం పక్కా అంటున్నారు. ఇక ఆ తర్వాతి రోజే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా తెలంగాణాలో ఉండడంతో కేసీఆర్ వర్సెస్ మోడీ అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ సభ తర్వాత రోజే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ

కేసీఆర్ సభ తర్వాత రోజే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ


కెసిఆర్ 18వ తేదీన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు శ్రీకారం చుడితే, ఆ తర్వాతి రోజు ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఇక సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ రాక తర్వాత తెలంగాణ బిజెపి నేతలు మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు.

English summary
KCR BRS meeting will be held on 18th. As a result, BJP has decided to hold Modi meeting on 19th in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X