హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో సొంత రాష్ట్రం నుంచి పోటీ: సికింద్రాబాద్‌పై కన్నేసిన అజహరుద్దీన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను సొంత రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని అన్నారు. 'నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు, గ్రామాల్లో పర్యటించాను. ప్రజలు, రైతులతో మాట్లాడాను. వారంతా సికింద్రాబాద్‌ నుంచే పోటీ చేయాలని చెప్పారు' అని అజహరుద్దీన్ వివరించారు.

Mohammad Azharuddin keen to contest 2019 polls from Secunderabad

కాగా, 2009లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి లోక్‌సభకు మొహమ్మద్ హాజరుద్దీన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్‌లోని టోంక్‌-సవాయ్‌ మాధోపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే, 2019లోకసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అజహరుద్దీన్ సింకింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

English summary
After contesting the last two Lok Sabha elections from Uttar Pradesh and Rajasthan, Congress leader and former Indian cricket captain Mohammad Azharuddin is keen to fight the 2019 polls from his home state Telangana's Secunderabad constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X