అతని పెళ్లామే ఇదింతా చేసింది.. మోహన్ బాబు మరో సంచలనం

మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగదాలు ఏర్పడ్డాయి. దీంతో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్‌ 30 మంది బౌన్సర్లను దింపాడు. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

మనోజ్ తన భార్యతో భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడున్న సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామానికి ముందు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్‌ను ఉద్దేశించి ఓ ఆడియోను విడుదల చేశారు.

Mohan Babu said this quarrel happened because of Bhuma Mounika

ఈ ఆడియోలో మోహన్ బాబు మాట్లాడుతూ మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను.. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. నీ భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావని, తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డామని, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, మనోజ్‌ నన్ను కొట్ట లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.అంతేగాక నా ఇంట్లోకి అడుగుపెట్టే అధికారం నీకు లేదు.. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు.. రోడ్డుకెక్కి నా పరువు తీశావు.. నా ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నా ఇష్టం.

పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అన్నది నా ఇష్టమని మోహన్ బాబు తేల్చి చెప్పేశారు. మోహన్ బాబు మాటల్లో మనోజ్ భార్య భూమా మౌనిక వల్లే ఇదింతా జరిగిందనే అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఆమె వల్లే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. అసలు భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడమే మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదని, ఆ తర్వాత భార్య మాటలు విని మనోజ్ ఇప్పుడు సొంత తండ్రి మీదే దాడి చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు కూడా భూమా మౌనికను టార్గెట్ చేసుకుని మనోజ్‌పై మండిపడ్డారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+