తమ్ముడూ! మళ్లీ మీరే గెలవాలి: టీఆర్ఎస్ గెలుపుపై మోహన్ బాబు, అదీ వారి పరిస్థితి: కవిత
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని తాను కోరుకుంటున్నానని ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆదివారం అన్నారు. విశాఖ పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఆలయ అఱ్చకులు, సిబ్బందికి కలెక్షన్ కింగ్ వస్త్రదానం చేశారు.
ఆ సమయంలో మంత్రి (ఆపద్ధర్మ) తుమ్మల నాగేశ్వర రావు ఉన్నారు. ఆలయానికి వచ్చిన తుమ్మలను తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మళ్లీ మీరే గెలవాలని కోరుకుంటున్నానని ఆయనతో చెప్పారు.

130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రస్తుతం దయనీయస్థితిలో ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వేరుగా అన్నారు. అభ్యర్థులను కూడా ఎంపిక చేసుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు మీరేం చేస్తారని నిలదీశారు. ప్రజాకూటమిని ప్రజలు తిప్పికొట్టాలని కవిత పిలుపునిచ్చారు. అమరావతిలో లిస్ట్ ఫైనల్ కావడం కాంగ్రెస్ పార్టీ నేతల దురదృష్టమన్నారు.












Click it and Unblock the Notifications