• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mother's Day 2020: చరిత్ర ఏంటీ, మే నెల రెండో ఆదివారమే ఎందుకు..?

|
Google Oneindia TeluguNews

అమ్మ.. ప్రేమకు ప్రతీరూపం, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడూ పిల్లల గురించే ధ్యాస.. వారి ఉన్నతి కోసం ఆలుపెరగకుండా శ్రమించేది తల్లి ఒక్కరే. కనిపించే దేవుళ్లలో కూడా అమ్మకే మొదటిస్థానం. తర్వాత తండ్రి, గురువుకు చోటు దక్కింది. ఏ స్వార్థ్యం లేకుండా, నిస్వార్థంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతోన్న మాతృమూర్తుల కోసం ప్రతీ ఏటా 'మదర్స్ డే' నిర్వహిస్తున్నారు. మే రెండో ఆదివారం రోజున జరుపుకొంటారు. ఇంతకీ సెకండ్ వీక్ సండే ఏందుకు..? దాని చరిత్ర ఏంటీ..? ప్రాముఖ్యతపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.

మా తుఝే సలాం : నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం... మదర్స్ డే ఎలా పుట్టింది..?మా తుఝే సలాం : నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం... మదర్స్ డే ఎలా పుట్టింది..?

అమ్మ.. అమ్మ...

అమ్మ.. అమ్మ...

అడగందే అమ్మ కూడా ఏమీ పెట్టదంటారు. కానీ అది అబద్దం. పిల్లల మనస్తత్వం సరిగా అంచనా వేయడంలో అమ్మ తర్వాత ఎవరైనా. వారికి ఏ సమయంలో ఏం కావాలి..? ఏం ఇవ్వాలి అని ఆమెకు తెలుసు. తన కుటుంబం కోసం రేయనక, పగలనక శ్రమిస్తోంది. కానీ పితృస్వామ్య వ్యవస్థలో కొన్నిచోట్ల తల్లులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదు. మరికొన్ని చోట్ల మాత్రం గౌరవింపబడుతోన్నారు. మదర్స్ డే పునాది పడింది మాత్రం అగ్రరాజ్యం అమెరికాలోనే.. 1914 నుంచి మదర్స్ డేను అధికారికంగా నిర్వహిస్తున్నారు.

మదరింగ్ వేడుక

మదరింగ్ వేడుక

గ్రీస్‌లో రియా అనే దేవత ఉండేవారు. ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్ అని పిలిచేవారు. 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో తల్లులను గౌరవిస్తూ మదరింగ్ సండే పేరుతో ఉత్సవం నిర్వహించేవారు. 1872లో అమెరికాలో జూలియవర్డ్ హోవే అనే మహిళ మదర్స్ డే నిర్వహించాలని పట్టుబట్టారు. మాతృమూర్తుల కోసం మదర్స్ డే జరపాలనే ఆలోచన పడింది అప్పుడే.. అన్న మేరీ అనే మహిళ కూడా మదర్స్ డే జరపాలని పోరాడారు. అయితే ఆమె బతికుండగా మాత్రం సాధ్యం కాలేదు. ఆమె కూతురు మిస్ జెర్విన్ ప్రయత్నంతో మదర్స్ డే వేడుక సక్సెస్ అయ్యింది. 1911 నుంచి అమెరికాలో క్రమంగా జరుపుకోవడం ప్రారంభించారు.

1911లో అంకురార్పణ

1911లో అంకురార్పణ

1914 నుంచి మదర్స్ డే ను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ వేడుకకు అంకురార్పణ చేశారు. తర్వాత క్రమంగా ఇతర దేశాలు జరుపుకోవడం ప్రారంభించాయి. మన కోసం అన్నీ చేస్తోన్న వారికి ఒకరోజు కేటాయించడం గొప్ప కదా అనుకొని.. అన్నీ దేశాలు నిర్వహిస్తున్నాయి. అలా మే రెండో ఆదివారం రోజున మాతృదినోత్సవంగా జరుపుకొంటున్నారు. కానీ ఈ సారి కరోనా వైరస్ మదర్స్ డేపై ఎఫెక్ట్ చూపనుంది. చదువుకొనేందుకు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు తమ మాతృమూర్తులను కలుసుకొనే అవకాశం లేకుండా పోయింది. పిల్లల ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తోన్న తల్లులందరికీ వన్ ఇండియా తెలుగు తరఫున హ్యాపీ మదర్స్ డే.

English summary
Mother's day 2020 In Telugu: why we are celebrate mothers day in may month second sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X