రేవంత్‌కు మోత్కుపల్లి షాక్: 'మురికిపోయింది, ప్రజలే బుద్ది చెబుతారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: టిడిపిలో నాయకులుగా ఎదిగి ప్రయోజనం పొంది మోసం చేసిన వారికి ప్రజలే సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

రేవంత్ ఎఫెక్ట్: పెరుగుతున్న వలసలు, దిద్దుబాటలో టిడిపి

శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోత్కుపల్లి నర్సింహ్ములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రేవంత్‌ దెబ్బ: ఆ లేఖ ఎక్కడుంది, చంద్రులకు చుక్కలేనా?

రేవంత్‌రెడ్డి వెంట కొందరు కీలక నేతలు పార్టీని వీడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి, బిల్యానాయక్‌లు రేవంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనం

నల్గొండ అసెంబ్లీ ఇంఛార్జీగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.ఈ తరుణంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.

రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?

పార్టీకి అంటిన మురికి పోయింది

పార్టీకి అంటిన మురికి పోయింది

రేవంత్‌రెడ్డితో పాటు కొందరు నేతలు పార్టీని వీడడంపై మోత్కుపల్లి నర్సింహ్ములు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీతో ప్రయోజనం పొంది కీలక నేతలుగా ఎదిగినవారు పార్టీని మోసం చేస్తే వారికి ప్రజలే సరైన సమయంలో బుద్ది చెబుతారన్నారు. ఇటీవల పార్టీని వీడి వెళ్ళినవారి వల్ల పార్టీకి అంటిన మురికి పోయిందన్నారు. పార్టీలో మంచే మిగిలిందని ఆయన అభిప్రాయపడ్డారు.నాయకులు పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు, ప్రజలు ఎక్కడికి పోలేదన్నారు.

12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి

12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి

2019 ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని 12 సీట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్‌పై ఉందని మోత్కుపల్లి నర్సింహ్ములు అభిప్రాయపడ్డారు.
ఉత్తమ్‌, జానా, గుత్తా, కోమటిరెడ్డి బ్రదర్స్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి వంటి నాయకులు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని మోత్కుపల్లి నర్సింహ్ములు ఆరోపణలు గుప్పించారు.

కలెక్టరేట్ల ముట్టడి

కలెక్టరేట్ల ముట్టడి

తెలంగాణ ప్రభుత్వంపై దశల వారీగా పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 20వ తేదీన నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించాలని మోత్కుపల్లి నర్సింహులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. పత్తి, వరి వేసిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవడం కోసం తెలుగుదేశం పార్టీని నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

కార్యకర్తల్లో జోష్ నింపిన మోత్కుపల్లి

కార్యకర్తల్లో జోష్ నింపిన మోత్కుపల్లి

టిడిపి నల్గొండ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి హజరైన పార్టీ కార్యకర్తల్లో మోత్కుపల్లి నర్సింహ్ములు తన ప్రసంగాల ద్వారా జోష్ నింపారు.పార్టీలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై ఆయన స్పందించారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు మోత్కుపల్లి ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTdp senior leader Motkupalli narasimhulu sensational comments on Revanth reddy on Saturday at Nalgonda . He participate TDP Nalgonda general body meeting held at Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి