ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో సీబీఐ విచారణకు డిమాండ్, స్థానికసంస్థల ఎన్నికల వాయిదా ఇందుకే!

ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, సామాజిక న్యాయం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఆనాడు పేదలపై అరాచకాలు చేశారని, ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడడం సిగ్గుచేటు: ఎంపీ డీకే అరుణ
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని జూన్ 25వ తేదీని దేశవ్యాప్తంగా సంవిదాన్ హత్యా దివస్ గా పాటిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తన అజెండాను దేశం పైన రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టిందని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

MP DK Aruna sensational comments on congress over phone tapping kaleswaram cases and local body elections

కాంగ్రెస్ ఎన్నికల వాయిదా అందుకే
జూన్ 25వ తేదీన దేశ చరిత్రలోనే చీకటి రోజని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ కు లేదని, అందుకే ఎన్నికలను వాయిదా వేస్తుందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ
కాళేశ్వరం, పోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బిజెపి నేతలందరూ బాధితులే అని ఆమె అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలపై, గత ప్రభుత్వ పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

రేవంత్ ముందు ఎమర్జెన్సీ గురించి మాట్లాడమన్న డీకే అరుణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపు చూసి ఓర్చుకోలేక రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి ఏంటో పాకిస్థాన్ కు చూపించామని, ప్రధానిని విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి ముందు ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలని ఎంపీ డీకే అరుణ సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+