రైల్వే కోర్టుకు వచ్చిన కల్వకుంట్ల కవిత (ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దిశగా పోరాటం చేసిన ఉద్యమ నాయకుల పైన కేసులు కొట్టివేయాలని తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో.. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కవిత పైన రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారనే అభియోగం ఉంది.
ఈ నేపథ్యంలో ఆమె సోమవారం రైల్ రోకోలో భాగంగా పలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారనే అభియోగం పైన విచారణలో పాల్గొనేందుకు సికింద్రాబాదులోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి కేసును జనవరి 28వ తేదీకి వాయిదా వేశారు.

కవితతో పాటు జాగృతి నాయకులు వెంకటరమణ, ఎం వరలక్ష్మి, సంధ్యా రెడ్డి, సుచిత్ర తదితరులు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు ఉద్యమ నాయకుల పైన కేసులు కొట్టివేయాలని తాను కేంద్రంను కోరినట్లు చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఒక ప్రాంతంలోనే వివరాలు నమోదు చేయించినట్లు నిజామాబాద్ కవిత అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చినా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సోమవారం హైదరాబాద్ పంజాగుట్టలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications