సోనియాను మర్చారు, పదవుల కోసమే..: కవిత

నిజామాబాద్: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రజలు మర్చిపోయారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

13ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఎంపీ కవిత స్పష్టం చేశారు. పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంతసేపూ పదవుల కోసం పాకులాడారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పాల్గొనని నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా పేరున్న డి శ్రీనివాస్, షబ్బీర్ అలీ, సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటివారు జిల్లాకు చేసేందేమి లేదని విమర్శించారు. ఆంధ్ర పాలకుల వల్లే తెలంగాణ అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. కాగా, ఎండవల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపి కవిత సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

MP Kavitha fires at congress leaders

సయ్యద్‌సల్వా ఫాతిమాకు రూ.35లక్షల చెక్కునందించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: పాతబస్తీకి చెందిన సయ్యద్ సల్వా ఫాతిమాకు కమర్షియల్ ఫైలట్‌గా శిక్షణ పొందటానికి ముఖ్యమత్రి చంద్రశేఖర్ రావు మంగళవారం రూ.35.5 లక్షల చెక్కునందించారు. కమర్షియల్ ఫైలట్‌గా శిక్షణ పొందటానికి తనకు ఆర్థికసాయం చేయాలని ఫాతిమా మంగళవారం సిఎం అధికారిక నివాసానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఫాతిమా విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సిఎం ఆర్థికసాయం నిమిత్తం చెక్కును అందజేశారు. తన కోరికను మన్నించి ఆర్థికంగా పూర్తి భరోసా కల్పించిన సిఎంకు ఫాతిమా శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+