‘ఉలవచారు’ రెస్టారెంట్ ప్రారంభించిన కవిత, రామ్‌చరణ్

దర్శకుడు సురేందర్ రెడ్డి రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 'ఉలవచారు' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.

హైదరాబాద్: సినీ ప్రముఖులు వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో 'ఉలవచారు' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. వాస్తవానికి సొంతంగానే రెస్టారెంట్ ను ప్రారంభించాలని ఆయన భావించినప్పటికీ... చివరకు హైదరాబాద్ లో ఎంతో పాపులర్ అయిన ఉలవచారు రెస్టారెంట్ ఫ్రాంఛైజీని తీసుకున్నాడు.

MP Kavitha and hero RamCharan launches SurrenderReddy's Ulavacharu Restaurant

ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత, హీరో రామ్ చరణ్‌లు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీ ప్రముఖులు దిల్ రాజు, జగపతి బాబు, వివి వినాయక్, క్రిష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డికి వీరంతా శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, తెలుగు సినీ ప్రముఖులు సందీప్ కిషన్, లక్ష్మీ మంచు, అనిల్ సుంకర, నవదీప్, కోన వెంకట్, శశాంక్, తదితరులు ఇప్పటికే రెస్టారెంట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా, సురేందర్ రెడ్డి వీరి జాబితాలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+