ఆసరా: రైతు కుటుంబాలకు విరాళంగా ఎంపీ కవిత ఏడాది జీతం (ఫోటో)
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి అన్ని చర్యలూ తీసుకుంటుందని జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. రైతు కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహిస్తున్న దత్తత కార్యక్రమానికి ఎంపీగా తనకు వచ్చే ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.
Decided to donate my one year salary for the #TelanganaJagruthi farmers' welfare fund.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 26, 2015 ఈ మొత్తాన్ని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అందిస్తామన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దత్తత తీసుకొని వారిని ఆదుకొనే కార్యక్రమానికి తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఎంపీ కవిత స్వీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
రైతు కుటుంబాల దత్తత తీసుకునేందుకు సంస్థల యజమానులు, కొంతమంది వ్యక్తులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నైకి చెందిన స్మార్ట్ ట్రెయినింగ్ రీసోర్సెస్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు రామ్, లావణ్యారామ్ లక్ష రూపాయలు చెక్‌ను ఎంపీ కవితకు ఆదివారం అందజేశారు.
Thanks to Smt Lavanya and Sri Ram (Chennai), who donated Rs 1 lakh to #TelanganaJagruthi farmers' welfare fund pic.twitter.com/fNoyJgBm5b
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 26, 2015 











Click it and Unblock the Notifications