యాదాద్రికి నన్నెందుకు పిలవలేదు; దేవుడి విషయంలో కేసీఆర్ నీఛరాజకీయాలు: ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణాకే తలమానికంగా నిలిచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ పునఃప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునఃప్రారంభం కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. యాదాద్రిలో ఉదయం 9 గంటల నుండే ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రారంభం కాగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఉద్ఘాటనలో పాల్గొన్నారు.

మహా సంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొన్న కెసిఆర్, స్వామివారి శోభాయాత్రను నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, ఈరోజు ఉదయం నుండి యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కొనసాగాయి. ఒకపక్క యాదాద్రిలో సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమాలలో పాల్గొంటే, స్థానిక ప్రజా ప్రతినిధి అయిన తనకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

MP Komatireddy venkat reddy Fires on CM KCR for not inviting him to the Yadadri temple inauguration

యాదాద్రి ఆలయ పున ప్రారంభానికి తనకు ఆహ్వానం అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని మండిపడిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎంపీగా ఉన్న తనకు ఆహ్వానం పంపలేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంఓ ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు.


కేవలం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు అని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర కేసీఆర్ బహు నీచపు రాజకీయాలు చేయడం బాధాకరమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం వస్తుందని పార్లమెంటు సమావేశాలు ఉన్నా హైదరాబాద్ కు వచ్చి ఎదురుచూస్తున్నానని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేవుడి విషయంలో రాజకీయాలు చేయడం బాధాకరం అంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+