ఈటలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు; 30 వేల మెజార్టీతో ఈటల విజయం: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెన్సేషన్ !!
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ లో బిజెపి దూసుకుపోతోంది. టిఆర్ఎస్ పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుండి బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి ఇటు బిజెపికి ప్రతిష్టాత్మకం కావడంతో ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అభివృద్ధి మంత్రాన్ని,దళిత బంధు పథకాన్ని నమ్ముకుంటే, సీఎం కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రచారం చేసిన బిజెపికి హుజురాబాద్ ఓటర్లు పట్టం కడుతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల గెలుపు తధ్యం : బీజేపీ
ఇక హుజురాబాద్ లో బీజేపీ విజయం ఖాయం అయిందని నిర్ధారించుకున్న తరువాత బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురబోతుందని, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ అసెంబ్లీకి వెళ్లబోతున్నారని, సీఎం కేసీఆర్ ను ప్రజలు ఆదరించడం లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ సైతం హుజురాబాద్ ఓటర్ల తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు అని, ఈ తీర్పుతోనైనా సీఎం కేసీఆర్ కు కనువిప్పు కలగాలని పేర్కొన్నారు.

30 వేల మెజార్టీతో ఈటల రాజేందర్ విజయం సాధిస్తారు : కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి
ఇదిలా ఉంటే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ 30 వేల మెజారిటీతో గెలవబోతున్నారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టిఆర్ఎస్ పార్టీ ఐదు నెలల్లోనే ఐదు వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు అంటూ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారని తేల్చి చెప్పారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు .. అందుకే ఈటలకు కాంగ్రెస్ మద్దతు
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఈటలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లు ఉండడం పైన కూడా స్పందించిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తాము గట్టిగా పోరాటం చేయలేదని, గట్టిగా పోరాడితే ఓట్లు చీలి టిఆర్ఎస్ పార్టీకి లాభం జరిగేది అంటూ వ్యాఖ్యానించారు . ప్రతిపక్షాల ఓట్ల చీలికతో కెసిఆర్ గెలిచి మళ్ళీ ప్రజలను మభ్య పెడతారు అంటూ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈటల రాజేందర్ కు తాము పరోక్షంగా మద్దతు ఇచ్చామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

అన్ని రౌండ్ లలోనూ ఈటలదే ఆధిక్యం
ఇదిలా ఉంటే హుజురాబాద్ నియోజకవర్గ కౌంటింగ్ లో 8 రౌండ్లు ముగిసేసరికి ఈటల రాజేందర్ 3,270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఎనిమిదవ రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ కొద్దిపాటి ఆధిక్యాన్ని చూపించింది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం ఎనిమిది రోజుల తర్వాత బీజేపీ 35,107 ఓట్లు టిఆర్ఎస్ పార్టీ 31,837 ఓట్లు కాంగ్రెస్ పార్టీ 1175 ఓట్లతో కొనసాగుతోంది. ఇక ఎనిమిదవ రౌండ్ లో గెల్లు శ్రీనివాస్ ,కౌశిక్ రెడ్డి సొంత గ్రామాల ఓట్లు లెక్కింపు జరిగిన క్రమంలో ఎనిమిదవ రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ 4248, బిజెపి 4086, కాంగ్రెస్ 89 ఓట్లను సాధించాయి. ఇప్పటివరకూ కౌంటింగ్ కొనసాగిన అన్ని రౌండ్లలోనూ ఈటల రాజేందర్ దే పైచేయిగా నిలిచింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications