వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను వినలేదు - నేను చూడలేదు : పార్టీ నుంచి తప్పించాలి - కోమటిరెడ్డి డిమాండ్..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య అగాధం తగ్గేలా కనిపించటం లేదు. రేవంత్ వ్యాఖ్యలు..ఆయన తీరు పైన ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అద్దంకి తన పైన చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక పార్టీ పెద్దలు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. తనకు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన సమావేశాలకు ఆహ్వానం లేదని చెప్పారు. ఈ సమయంలో రేవంత్ ఒక వీడియో సందేశం ద్వారా కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పారు.

Recommended Video

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి, ఎందుకంటే *Telangana | Telugu OneIndia
రేవంత్ క్షమాపణ చెప్పినా

రేవంత్ క్షమాపణ చెప్పినా

హోం గార్డు వ్యాఖ్యలు చేయటం తప్పేనన్నారు. అద్దంకి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని..క్రమశిక్షణా కమిటీ ఆ వ్యాఖ్యల ఆధారంగా చర్యలు తీసుకోవాలని మరోసారి చిన్నారెడ్డిని కోరుతున్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కోమటిరెడ్డి పాత్ర కీలకమని రేవంత్ తన వీడియోలో పేర్కొన్నారు. ఇక, రేవంత్ క్షమాపణ చెప్పటంతో సమస్య ముగుస్తుందని పార్టీ నేతలు భావించారు. దీని పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ క్షమాపణ చెప్పిన అంశం తాను వినలేదు ..చూడలేదని చెప్పారు. తాను పాదయాత్రలో పాల్గొనటం లేదని తేల్చి చెప్పారు.

అద్దంకిని సస్పెండ్ చేయాలి

అద్దంకిని సస్పెండ్ చేయాలి


తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని కోమటిరెడ్డి డిమాండ్ చేసారు. ఈ సమయంలో అద్దంకి దయాకర్ సైతం ఒక వీడియో విడుదల చేసారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వివరించారు. క్రమశిక్షణ కమిటీ తనకు షోకాజ్ ఇచ్చిందని..నోటీసులకు వివరణ ఇవ్వటంతో పాటుగా లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పానని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. వీడియో ద్వారా మరోసారి క్షమాపణలు చెప్పారు.

పాదయాత్రకు దూరంగా కోమటిరెడ్డి

పాదయాత్రకు దూరంగా కోమటిరెడ్డి


అయితే, ఇప్పుడు కోమటిరెడ్డి తాజాగా అద్దంకి పైన సస్పెన్షన్ వేటు వేయాలని..ఆ తరువాతనే తాను రేవంత్ క్షమాపణ పైన స్పందిస్తానని చెప్పటం ద్వారా..ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అటు రేవంత్ రెడ్డికి కరోనా లక్షణాలు కనిపించటంతో.. ముందు జాగ్రత్తగా రేవంత్ ఈ రోజు మునుగోడు పాదయాత్రలో పాల్గొనాల్సి ఉన్నా, దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి తాజా డిమాండ్ పైన టీపీసీసీ స్పందన తెలియాల్సి ఉంది.

English summary
MP Komatireddy Venkata Reddy demanded to suspend Addanki Dayakar from party, after Reant apologies for MP Venkata Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X