అధిష్టానాన్ని తప్పుపట్టిన ఎమ్మెస్సార్, అదృష్టంలేక..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరిగా వ్యవహరించక పోవడం వల్లే అధికారం కోల్పోయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు రెండ్రోజుల క్రితం అన్నారు. ఎమ్మెస్సార్ 83వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినా దానిని ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్లలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్నదని వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవిని తాను ఆశించినా అదృష్టం లేకనే రాలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా హామీలు ఇస్తున్నారని, వాటిని అమలు చేసే శక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలన్నారు. కాగా, ఎం సత్యనారాయణ రావుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications