ఉప్పల్ స్టేడియంలో మందుబాబుల వీరంగం: అభిమానుల మధ్య ఘర్షణ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మంగళవారం ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై ముంబై ఇండియన్స్ టీం విజయం సాధించింది. అయితే, మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. హైదరాబాద్ ఈ టార్గెట్ ను ఛేదించే పనిలో ఉండగా .. స్టేడియంలో మందుబాబులు హల్చల్ చేశారు.

కొందరు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఫ్యాన్స్ గొడవపడుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతోనూ మందబాబులు వాగ్వాదానికి దిగడంతో వారిని బయటికి పంపించేశారు. అయితే, మద్యం తాగినవారిని స్టేడియంలోకి ఎలా అనుమతించారని క్రికెట్ అభిమానులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ చూసేందుకు ఎంతో ఆసక్తితో వస్తే తాగుబోతులు ఘర్షణలకు దిగి తమను భయాందోళనలకు గురిచేశారని మండిపడుతున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications