అక్కడ మద్యం షాపులు బంద్.. బల్క్ మెసేజ్ లు, గుంపులుగా ఉండటం నిషేధం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లకు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు ఉండగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్
ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ఈ నెల 11వ తేది బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికల సందర్బంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధం
బి.ఎన్.ఎస్. ఎస్ సి. ఆర్. పిసి 163ప్రకారం ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధించడం జరిగిందని ఎన్నికలు జరిగే ప్రాంతాలలోని పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నిషేధం రేపటి అనగా 10తారీఖు ఉదయం 6 గంటల నుండి 11తారీకు రాత్రి 8గంటల వరకు అమలులో వుంటుందని. ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
48 గంటలు సైలెన్స్ పీరియడ్
ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెన్స్ పీరియడ్ గా పాటించాలని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగే జిల్లాలో ఎన్నికల అధికారులు ప్రకటన విడుదల చేశారు. 48 గంటలు సైలెన్స్ పీరియడ్ గా పేర్కొన్నారు. ఈ 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో ఆయా మున్సిపాలిటీలలో స్థానికులు మాత్రమే ఉండాలని కలెక్టర్లు చెబుతున్నారు.
బల్క్ మెసేజ్ లు పంపటం నిషేధం
రాజకీయ ప్రచారానికి సంబంధించిన బల్క్ మెసేజ్ లు పంపడం నిషేధించామని తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
మద్యం షాపులు బంద్
కాగా ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ దృష్ట్యా నేడు సాయంత్రం 5 గంటల నుంచి 11న పోలింగ్ ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, అలాగే ఓట్ల లెక్కింపు రోజైన 13న కూడా డ్రై డే అమల్లో ఉంటుందని కలెక్టర్లు వెల్లడించారు. దీంతో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications