వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు ఉపఎన్నిక రద్దు చెయ్యాలి.. షాకింగ్ రీజన్స్ చెప్పి కేఏ పాల్ సంచలన డిమాండ్

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికలు వార్ వన్ సైడే నని, మునుగోడు లో గెలిచేది తామేనని, విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన కే ఏ పాల్ ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు. మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కేఏ పాల్, బ్యాలెట్ పేపర్ ల తో తిరిగి మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు ఉపఎన్నిక రద్దు చేసి మళ్ళీ పెట్టాలన్న కేఏ పాల్

మునుగోడు ఉపఎన్నిక రద్దు చేసి మళ్ళీ పెట్టాలన్న కేఏ పాల్


మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలైన కె ఏ పాల్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటినుండి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను కోరిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

 స్ట్రాంగ్ రూమ్ కి వేసిన సీల్ మారింది.. కేసీఆర్ కు తొత్తులుగా అధికారులు : పాల్ ఆరోపణ

స్ట్రాంగ్ రూమ్ కి వేసిన సీల్ మారింది.. కేసీఆర్ కు తొత్తులుగా అధికారులు : పాల్ ఆరోపణ


మునుగోడు ఉప ఎన్నికలో అధికారులు పూర్తిగా సీఎం కేసీఆర్ కోసం పని చేశారని, ఆయనకు తొత్తులుగా మారారని కే పాల్ విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ పై, ఎన్నికల కౌంటింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కెఏ పాల్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లో బిగించిన సీసీ కెమెరాల కు సంబంధించిన లింకు తమకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ కి వేసిన సీల్ మారిందని కె ఏ పాల్ వెల్లడించారు.

 డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టినా ఎందుకు ఉపఎన్నిక రద్దు చెయ్యరు

డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టినా ఎందుకు ఉపఎన్నిక రద్దు చెయ్యరు


మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నెంబర్ కు ఓటు వేయించారు అని కె ఏ పాల్ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచి ఎన్నికలు నిర్వహించారని ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలిసినప్పటికీ, ఈ ఎన్నికలు ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని కె.ఎ.పాల్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎన్నికల అధికారులు ఎందుకు బయటికి పంపించలేదు చెప్పాలని కె ఏ పాల్ ప్రశ్నించారు.

 మునుగోడు ప్రజలు కేసీఆర్ ను ఛీ కొడుతున్నారు

మునుగోడు ప్రజలు కేసీఆర్ ను ఛీ కొడుతున్నారు


అవినీతి, అక్రమాలు జరగనప్పుడు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎందుకు కౌంటింగ్ చేయలేదని కె ఏ పాల్ ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఛీ కొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారు అని చెప్పుకొచ్చిన కేపాల్ మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

English summary
KA Paul has made a sensational demand by giving shocking reasons regarding the Munugode by-election that he will ask the Election Commission to cancel the Munugode by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X