Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాయ్ రాజా కాయ్.. మునుగోడులో మొనగాడెవరు? మొదలైన బెట్టింగ్ దందా!!

మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో, రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక పై ఉంది. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది? ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ ను రేకెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీ ఎన్నికల ప్రచారాన్ని చేయడంతో మునుగోడులో మొనగాడు ఎవరు అన్న చర్చ జోరందుకుంది. ఇక ఆ చర్చ అంతటితో ఆగక జోరుగా బెట్టింగ్ లకు పాల్పడే దాకా వెళ్ళింది.

ఐపీఎల్ తరహాలో మునుగోడులో జోరుగా బెట్టింగ్స్

ఐపీఎల్ తరహాలో మునుగోడులో జోరుగా బెట్టింగ్స్

మునుగోడు ఉప ఎన్నిక పై ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ లు మునుగోడు పై జెండా ఎగురవేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏ పార్టీ గెలుస్తుంది అన్నదానిపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ముఖ్యంగా పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని భావిస్తున్న క్రమంలో గెలిచేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని కోట్లలో బెట్టింగ్లు వేస్తున్నారు బెట్టింగ్ మాఫియా.

మునుగోడు ఉపఎన్నికపై కోట్ల రూపాయల బెట్టింగ్ దందా

మునుగోడు ఉపఎన్నికపై కోట్ల రూపాయల బెట్టింగ్ దందా


మరికొందరు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడులో విజయం సాధిస్తాడని బెట్టింగ్ పెడుతున్నారు. ఇక ఈ బెట్టింగ్ మాఫియా మునుగోడు గడ్డమీద దందా సాగించడానికి ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడుతో పాటుగా చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాదులోని పలు ప్రాంతాలలో ఏజెంట్లను నియమించుకుని తమ దందా సాగిస్తున్నారు. ఇక ఈ ముఠా ఎవరికీ పట్టుబడకుండా ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ ద్వారా దందా సాగిస్తున్నట్టు సమాచారం. కోట్ల రూపాయల బెట్టింగ్ దందా మొదలైందని సమాచారం.

అప్రమత్తమైన పోలీసులు .. బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు అంటూ హెచ్చరికలు

అప్రమత్తమైన పోలీసులు .. బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు అంటూ హెచ్చరికలు

ఇక మునుగోడు పై ఫోకస్ పెట్టి బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగిందని పోలీసులకు అందుతున్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ మాఫియాపై నిఘా పెట్టింది. ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మునుగోడు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే .. మరోపక్క ఎవరు గెలుస్తారు? మునుగోడులో జెండా ఎగరవేసే మొనగాడు ఎవరు అన్న ఉత్కంఠ నేపధ్యంలో బెట్టింగ్ మాఫియా ఫోకస్ మునుగోడుపై పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+