వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు సమరం: ధనప్రవాహానికి బోలెడు దొడ్డి దారులు; ఆ దారుల్లో నో చెక్‌పోస్టులు!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కీలకంగా మారడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నాయి. ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రలోభాల పర్వానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాయి అన్ని ప్రధాన పార్టీలు.

మునుగోడుకు ధన ప్రవాహం .. అడ్డుకునే యత్నాల్లో ఎన్నికల అధికారులు

మునుగోడుకు ధన ప్రవాహం .. అడ్డుకునే యత్నాల్లో ఎన్నికల అధికారులు

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓటర్లను తమ వైపు మళ్ళించడం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రధాన పార్టీలన్నీ రెడీ అయ్యాయన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంలో భాగంగా మునుగోడులో ధన ప్రవాహం కొనసాగుతోంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రలోభాలకు గురి చేసేందుకు మునుగోడు కు భారీగా నగదును చేర్చాలని వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో మునుగోడులో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని, ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మునుగోడులో ఇప్పటివరకు 16 చెక్ పోస్టులు

మునుగోడులో ఇప్పటివరకు 16 చెక్ పోస్టులు

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం పదహారు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న నగదును పట్టుకుంటున్నారు. అయితే మునుగోడు మండలానికి చేరుకునేందుకు అనేక మార్గాలున్నాయి . ఈ మార్గాలలో అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయలేదు. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో మిగతా మార్గాల నుంచి సులువుగా మునుగోడు కు డబ్బు చేరుకునే అవకాశం కనిపిస్తుంది.

ధనప్రవాహానికి దొడ్డి దారులు ఇవే

ధనప్రవాహానికి దొడ్డి దారులు ఇవే

వెలిమినేడు హైవే నుండి మునుగోడు మండలం కిష్టాపురం గ్రామం మీదుగా మునుగోడుకు చేరుకునే వీలుంది. నల్గొండ నుంచి కలవలపల్లి గ్రామం మీదుగా మునుగోడు రావచ్చు. నార్కెట్ పల్లి నుంచి రత్తి పల్లి గ్రామం మీదుగా మునుగోడు చేరుకోవచ్చు. ఇక ఈ గ్రామాలలో చెక్ పోస్టులు లేకపోవడంతో ఈ గ్రామాల నుండి మునుగోడు మండలానికి డబ్బులు చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చండూరు మండలం లోని ఉడతల పల్లి వద్ద చెక్ పోస్టు పెట్టగా, గుర్రంపోడు మండలం నుంచి గుండ్రంపల్లి మీదుగా, గుర్రంపోడు నుంచి కస్తాల మీదుగా చుండూరు మండలానికి చేరుకోవచ్చు. ఇక ఈ దారుల లోనూ ఎక్కడ చెక్ పోస్ట్ లు లేవు.

చాలా చోట్ల ఏర్పాటు కాని చెక్ పోస్టులు

చాలా చోట్ల ఏర్పాటు కాని చెక్ పోస్టులు

మర్రిగూడ మండలంలోని తానేదార్ పల్లి వద్ద అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ నుంచి గున్గల్ క్రాస్ రోడ్ మీదుగా మర్రిగూడ మండలం శివన్న గూడెం కి వచ్చే రోడ్డు మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. ఇక నాంపల్లి మండలంలోని కొత్తపేట, వెంకటంపేట్, మహమ్మదా పురం మూడు చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేయగా, హైదరాబాదు నుంచి చింతపల్లి మండలం మీదుగా నాంపల్లి కి వచ్చే రోడ్డు మార్గంలో చెక్ పోస్టు లేదు.

అడ్డ దారుల్లో రాజకీయ పార్టీలకు ధనప్రవాహానికి రాచబాట

అడ్డ దారుల్లో రాజకీయ పార్టీలకు ధనప్రవాహానికి రాచబాట


ఇలా ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గం లోకి వచ్చే అనేక మార్గాలలో చెక్ పోస్టులు లేకపోవడంతో ఈ అడ్డదారులు అన్నీ ధన ప్రవాహం కొనసాగించడానికి రాజకీయ నేతలకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల అధికారులు ఈ అన్ని దారుల పైన దృష్టి సారిస్తే ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చు.

English summary
In munugode, 16 check posts were set up to check the flow of money in munugode by poll. However, the lack of check posts in many of the roads allows for the flow of money
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X