దుబ్బాక, హుజురాబాద్ ఓటర్ల పేరుతో మునుగోడులో పోస్టర్ల కలకలం.. ఆ పార్టీకి టెన్షన్!!

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతున్నారు. ఇక మునుగోడులో బలంగా ప్రచారం నిర్వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మునుగోడులో కాంట్రాక్ట్ పే పోస్టర్ లతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మునుగోడులో మళ్ళీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

పోస్టర్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్

పోస్టర్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్

మునుగోడు నియోజకవర్గం లోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల పరిధిలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మునుగోడు ప్రజలారా.. మేము మోసపోయాం.. మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజురాబాద్ ప్రజల పేరుతో చౌటుప్పల్ లో పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇక చండూరులోనూ నేడే విడుదల.. షా ప్రొడక్షన్ సమర్పించు.. 18 వేల కోట్లు.. దర్శకత్వం కోవర్టు రెడ్డి, సత్యనారాయణ 70ఎంఎం లో అంటూ సినిమా పోస్టర్ మాదిరిగా చుండూరులోనూ పోస్టర్లను ఏర్పాటు చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.

మునుగోడులో కాంట్రాక్ట్ పే పేరుతోనూ పోస్టర్లు

మునుగోడులో కాంట్రాక్ట్ పే పేరుతోనూ పోస్టర్లు

మొన్నటికి మొన్నమునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డి పేరుతో ఫోన్పే తరహాలో,కాంట్రాక్ట్ పేఅంటూ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి.కాంట్రాక్ట్ పే ద్వారా 18 వేల కోట్ల ట్రాన్సాక్షన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ చండూరు మండలం లోని అన్ని చోట్ల వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి.ఇందులో కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి ఫోటో తో పాటు బిజెపి 18 వేల కోట్లు ట్రాన్సాక్షన్ ఐడి అని పేర్కొన్నారు.అంతేకాదు 18 వేల కోట్ల కాంట్రాక్టు లతోపాటు 500 కోట్ల బోనస్ రివార్డునుకూడా గెలుచుకున్నారు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.

దుబ్బాక, హుజురాబాద్ ప్రజల పేరుతో బీజేపీకి ఓటు వెయ్యొద్దని పోస్టర్లు

దుబ్బాక, హుజురాబాద్ ప్రజల పేరుతో బీజేపీకి ఓటు వెయ్యొద్దని పోస్టర్లు

ఇక తాజాగా దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో బిజెపికి ఓటు వేయద్దు. బిజెపిని నమ్మి మోసపోయాం అంటూ వేసిన పోస్టర్లు బీజేపీకి తలనొప్పిగా మారాయి. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోస్టర్లు వేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్న వారిని ఎదుర్కోవడం ప్రస్తుతం బీజేపీకి పెద్ద సవాల్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రత్యర్థి పార్టీలు, ఇప్పుడు బీజేపీని నమ్మితే మోసపోతారు అని ప్రచారం చేస్తున్న తీరు బిజెపికి ఇబ్బందిగా మారింది. మరి ఈ పరిణామాలను బీజేపీ ఏవిధంగా ఎదుర్కోబోతున్నది అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+