వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు పోలింగ్ వేళ: భారీ నగదు సీజ్; 42మంది స్థానికేతరులను పంపించామన్న సీఈఓ వికాస్‌రాజ్

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. మునుగోడులో సాంకేతిక సమస్యలు తలెత్తిన ఈవీఎం లను మూడు చోట్ల మార్చినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు. మరో రెండు చోట్ల సమస్యలు తలెత్తటంతో వీవీ ప్యాట్ లను మార్చినట్లు వివరించారు. ఈవీఎం సమస్య తో ఒక చోట పోలింగ్ కొద్ది సేపు ఆలస్యం అయిందనీ చెప్పారు.

 42 మంది స్థానికేతరులను పంపించామని చెప్పిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

42 మంది స్థానికేతరులను పంపించామని చెప్పిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 42 మంది స్థానికేతరులను పంపించి వేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కూడా నేరమేనని వెల్లడించారు. ఇక ఫేక్ న్యూస్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. మర్రిగూడ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన వివాదంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారనీ సీఈవో తెలిపారు.

2,02,99,000 రూపాయల నగదు సీజ్

2,02,99,000 రూపాయల నగదు సీజ్


మునుగోడుపోలింగు కు సంబంధించి ఈ రోజు 38 కాల్స్ అందుకున్నట్లు, రెండు కోట్లరెండు లక్షల 99 వేల రూపాయిల నగదును పట్టుకున్నట్లు వెల్లడించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనలు మినహాయించి ప్రశాంతంగా జరుగుతోంది. నాలుగైదు చోట్ల ఈవిఎమ్ లు మొరాయించినప్పటికీ వెంటనే వాటిని సరిచేసి పోలింగ్ ప్రారంభించారు. 2.41 లక్షల మంది ఓటర్లున్న నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఇక పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు క్యూ కట్టారు.

ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్

ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్


వివిధ పార్టీలు, స్వతంత్రులతో కలిపి 47మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో 3 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు.. 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి. వంద చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి 5500 మంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. చండూరు, నారాయణ్ పురం ల లో కాంగ్రెస్, టీఆరెఎస్ అభ్యర్దులు పాల్వాయి స్రవంతి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటుచేసి హైదరాబాద్‌లో ఉన్నప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ఒంటి గంట వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 41.30% పోలింగ్

ఒంటి గంట వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 41.30% పోలింగ్


సాంకేతిక లోపాలు తలెత్తితే సరిచేయడానికి 28 మంది ఇంజినీర్లతో పాటు 35 శాతం ఈవీఎంలను అదనంగా సిద్ధం చేసి ఉంచారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 41.30% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2018సాధారణ ఎన్నికల్లో మునుగోడులో రికార్డు స్థాయిలో 91.30 శాతం ఓటింగ్‌ నమోదు కాగా ఈసారికూడా భారీగా ఓటింగ్ నమోదు అవుతుందనిఅధికారులు భావిస్తున్నారు.

English summary
Vikas Raj said that a huge cash of Rs 2,02,99,000 was seized and 42 non-locals were sent back during the munugode polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X