మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ, పార్టీలో చర్చ!!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు.

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిపై తుది నిర్ణయం
గతంలో హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ నుండి బలమైన అభ్యర్థిని బరిలోకి దిగకపోవడంతో మైనస్ అయిందని భావించిన, టిఆర్ఎస్ పార్టీ ఈసారి మునుగోడు నియోజకవర్గంలో ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్ధిగా ఖరారు చేస్తే పార్టీ గెలుస్తుంది అన్నదానిపై పలు సర్వేలను చేయించింది. ఇక ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక బరిలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.

టీఆర్ఎస్ అభ్యర్థిగా గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?
మునుగోడు ఉపఎన్నిక బరిలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దించుతారు అన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరందుకుంది. ఒకపక్క మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరుపై టిఆర్ఎస్ పార్టీ నేతలు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తే ఒప్పుకోబోమని అల్టిమేటం జారీ చేశారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఆయనవల్ల విభేదాలు చోటుచేసుకున్నాయని, ఆయనకు అవకాశం ఇస్తే ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలోనూ, సీఎం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వ్యతిరేఖత వ్యక్తం అవుతున్నా ఆయనకే టికెట్ ... పార్టీ వర్గాల్లో చర్చ
ఇక త్వరలో సంస్థాన్ నారాయణపూర్ లో జరగనున్న టిఆర్ఎస్ సభ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఎవరికీ అంతుచిక్కదు. ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక కారణాలు కూడా అంతే అర్థం కాకుండా ఉంటాయి. ఒక పక్క పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇస్తే పార్టీ విజయం సాధిస్తుందా ? అన్నది కూడా పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ.
Recommended Video


కూసుకుంట్లకు టికెట్ ఇస్తే అసమ్మతి నేతలు సహకరిస్తారా ? కేసీఆర్ ఏం చేస్తారో?
మొత్తానికి టిఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం మునుగోడు అభ్యర్థి ఎంపికపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. కూసుకుంట్ల పేరే పార్టీలో ప్రధానంగా వినిపిస్తుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతుంది. ఆయనకు టికెట్ ఇస్తే అసమ్మతి నేతలు పార్టీ కోసం పని చేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారిన చర్చ. మరి అధినేత కేసీఆర్ చివరి నిమిషం వరకు ఎవరి పేరును ప్రకటిస్తారు అన్నది మాత్రం ఉత్కంఠనే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications