ప్రకాష్‌రాజ్‌తో కలిసి కేసీఆర్ ప్రయాణం వెనుక ఉద్దేశమేమిటి? మురళీధర్ రావు సూటిప్రశ్న

బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ని ఓడించడమే బీజేపీ యొక్క లక్ష్యం అని ఆ పార్టీ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు. సోమవారం రోజు మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రయాణం చేయడం ప్రమాదకరమైన అంశం అని మండిపడ్డారు. కెసిఆర్ మహారాష్ట్ర పర్యటన పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన అభివృద్ధికి సంబంధించిన చర్చలు ఏమైనా జరిగితే వాటిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.

Recommended Video

    CM KCR - Prakash Raj Surprise Move దక్షిణాది రాష్ట్రాల్లో కీలకం | Third Front | Oneindia Telugu

     ప్రకాష్ రాజ్ తో కలిసి ప్రయాణంపై అనుమానం: మురళీధర్ రావు

    ప్రకాష్ రాజ్ తో కలిసి ప్రయాణంపై అనుమానం: మురళీధర్ రావు

    తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రమని, ముఖ్యమంత్రులు ఏమైనా చర్చించుకోవచ్చు అని పేర్కొన్న ఆయన ఏ విధమైన చర్చలు జరిపారో చెప్పాలన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి కెసిఆర్ ప్రయాణం చేయడంపై అనేక సందేహాలు ఉన్నాయని మురళీధర్ రావు పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ తో కలిసి కేసీఆర్ ప్రయాణం చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత నుండి దృష్టి మరల్చడం కోసం సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో పర్యటనలు చేస్తున్నారని మురళీధర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

     రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు ముళ్లు గుచ్చుకున్నా సీఎం కేసీఆర్ స్పందన

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు ముళ్లు గుచ్చుకున్నా సీఎం కేసీఆర్ స్పందన

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు ముళ్లు గుచ్చుకున్నా సీఎం కేసీఆర్ స్పందిస్తున్నారని మురళీధర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వాళ్లతో కలిసి వెళ్తే ఏకాకి కావాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ అంటే ఏం జరిగిందో అందరికీ తెలుసునని మురళీధరరావు ఎద్దేవా చేశారు. దేశ సైనిక శక్తిని గతంలో అనుమానించిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని, సర్జికల్ స్ట్రైక్ విషయంలో ప్రశ్నించి, అనుమానించి, అవమానించిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని విమర్శలు గుప్పించారు.

     కేసీఆర్ కొత్త డ్రామాలు అందుకే

    కేసీఆర్ కొత్త డ్రామాలు అందుకే


    తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సర్జికల్ స్ట్రైక్ ప్రశ్నించారని, దానిని ప్రశ్నించడం అంటే తెలంగాణ సైనిక శక్తిని ప్రశ్నించడమేనని మురళీధర్ రావు వెల్లడించారు.
    తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అవినీతి బయట పడుతుందని, అందుకే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని మురళీధర్ రావు విమర్శించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులతో, అవినీతి పరులతో సీఎం కేసీఆర్ కలుస్తున్నారని విమర్శించారు. దేశ ఉనికిని, దేశ ఐక్యతను టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది అని మురళీధర్ రావు పేర్కొన్నారు.

    ఢిల్లీ రాజకీయాలు చెయ్యాలంటే ముందు తెలంగాణలో గెలువు

    ఢిల్లీ రాజకీయాలు చెయ్యాలంటే ముందు తెలంగాణలో గెలువు

    ఇక కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలదోసిన పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీని నమ్ముకుంటే కెసిఆర్ ఒంటరిగా మిగిలిపోతాడు అని పేర్కొన్నారు. ఢిల్లీ రాజకీయాలు చేయాలంటే ముందు తెలంగాణా లో విజయం సాధించాలని మురళీధర్ రావు హితవుపలికారు. కెసిఆర్ రాజకీయ వ్యూహాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, ఖచ్చితంగా భవిష్యత్తు ఎన్నికలలో కెసిఆర్ ను ఓడించి తీరుతామని మురళీధర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మురళీధర్ రావు మండిపడ్డారు.
     ఉద్ధవ్ ఠాక్రేతో ఏ అభివృద్ధిపై చర్చించారో ప్రజలకు చెప్పాలి

    ఉద్ధవ్ ఠాక్రేతో ఏ అభివృద్ధిపై చర్చించారో ప్రజలకు చెప్పాలి

    ఏ అభివృద్ధిపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బిజెపి ఉన్నంతవరకు దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీయాలని మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదివారం మహారాష్ట్ర పర్యటనలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి కనిపించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కారణమైంది. అంతకు ముందు వచ్చిన వార్తల్లో గానీ పర్యటన షెడ్యూల్ లో కానీ ఎక్కడా ప్రకాష్ పేరు కనిపించలేదు. కానీ ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్ తో కలిసి కనిపించారు. కేసీఆర్ పర్యటన ముగిసే వరకు ఆయన కేసీఆర్ వెంటే ఉండడం ఆసక్తిని కలిగించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+