వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్, తెలంగాణ, ఏపీలలో హిందువులు, ముస్లీంల శాతం ఇదీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో హిందువులు, ముస్లీంలు, క్రిష్టియన్ల జనాభాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3.51 కోట్ల మంది జనాభా తెలంగాణలో ఉన్నారు. వారిలో హిందువులు 85.09 శాతం, ముస్లీంలు 12.68 శాతం, క్రైస్తవులు 1.27 శాతం, సిక్కులు 0.086 శాతం, బౌద్ధులు 0.092 శాతం, 0.092 శాతం ఉన్నారు. ఏ మతాన్ని వెల్లడించని వారు 0.678 శాతం.

తెలంగాణలో హిందూ, ముస్లీంలలో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. క్రైస్తవుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.

జనాభా పరంగా చూస్తే తెలంగాణలో హిందువులు 2.99 కోట్లు, ముస్లీంలు 44.64 లక్షలు, క్రైస్తవులు 4.47 లక్షలు, సిక్కులు 30,340, బౌద్ధులు 32,553, జైనులు 26,690, ఇతర మతాల వారు 5,422, ఏ మతానని వెల్లడించని వారు లేదా ఏ మతానికి చెందని వారు 2.98 లక్షలు ఉన్నారు.

Muslim population in TS and AP grew at a faster pace

ఏపీ విషయానికి వస్తే.. 2011 జనాభా లెక్కల ప్రకారం 4.93 కోట్లమంది జనాభా ఉంది. హిందువులు 90.86 శాతం, ముస్లీంలు 7.3 శాతం, క్రిస్టియన్లు 1.3 శాతంగా ఉన్నారు. ఏపీలో హిందూ, ముస్లీంలలో మహిళల కంటే పురుషులు ఎక్కువ. క్రైస్తవుల్లో మహిళలు ఎక్కువ. ఏపీలో క్రైస్తవులు కృష్ణా జిల్లాలో అధికంగా ఉన్నారు.

ఏపీలో జనాభా పరంగా.. హిందువులు 4.48 కోట్లు, ముస్లీంలు 36.17 లక్షలు, క్రైస్తవులు 6.82 లక్షలు, సిక్కులు 9,904, బౌద్ధులు 4,139, జైనులు 27,159, ఇతర మతస్తులు 4,125, మతాన్ని వెల్లడించని వారు 1,65,401 ఉన్నారు.

జిహెచ్ఎంసీ విషయానికి వస్తే.. హిందువులు 45.40 లక్షలు, ముస్లీంలు 21.07, క్రైస్తవులు 1.92 లక్షలు ఉన్నారు. మొత్తం జనాభా 69.93 లక్షలు. మిగతా వారు సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఇతర మతస్థులు, మతాన్ని వెల్లడించని వారు.

English summary
The Muslim population in both Telangana State and Andhra Pradesh grew faster than the Hindu population between 2001 and 2011. While Muslims constituted 12.43 per cent of the population in Telangana in 2001, it rose to 12.68 per cent in 2011 in the state. The proportion of Hindus shrank from 85.94 per cent to 85.09 per cent in Telangana during the same period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X