పచ్చని కొండల మధ్య 200 ఫీట్ల పైనుంచి జలపాతం.. హైదరాబాద్ కు దగ్గరలో..
చుట్టూ ఎత్తయిన పచ్చని కొండలు.. 200 ఫీట్ల పైనుంచి జాలువారుతున్న జలపాతం.. ప్రకృతి రమణీయమైన ఈ ప్రదేశాన్ని చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రాపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతానికి వీకెండ్స్ లో పర్యటకుల రద్దీ పెరుగుతోంది. దాదాపు 200 ఫీట్ల ఎత్తయిన కొండ నుంచి జాలువారుతున్న సెలయేటి దృశ్యాలను చూసేందుకు పర్యటకలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ జలపాతాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.
ఈ జలపాతానికి దగ్గరలో వెంకటాపురం బస్ స్టాండ్(13 కిలోమీటర్లు) ఉంది. అలాగే ఈ వాటర్ ఫాల్స్ కు దగ్గరలో వరంగల్ రైల్వే స్టేషన్( 160 కిలోమీటర్లు) ఉంది. అలాగే వరంగల్ ఎయిర్ పోర్టు(166 కిలోమీటర్లు) ఉంది. ఇక హైదరాబాద్ కు ఈ జలపాతం 300 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. జలపాతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు తమ కుటుంబం, చిన్నారులతో వీకెండ్స్ లో ఈ జలపాతాన్ని సందర్శిస్తుంటారు. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ కు కూడా అనువైన ప్రదేశంగా చెబుతారు. ట్రెక్కింగ్ ను ఇష్టపడే వాళ్లు కచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చెబుతున్నారు.
ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ పైకి చేరుకున్నాక అక్కడి వ్యూ పాయింట్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ జలపాతం ఓ కుగ్రామంలో ఉన్న కారణంగా ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇక్కడి ప్రాంతం ఓ స్వర్గధామంగా ఉంటుంది. గ్రామం నుంచి 8-9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండపైకి చేరుకోవచ్చు. జలపాతంలోని నీరు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. జలపాతం కింద స్నానం చేయడం, ఈతలు కొట్టడం చేస్తుంటారు. చాలా మంది పర్యటకులు 9 కిలోమీటర్లు ప్రకృతి మధ్య ట్రెక్కింగ్ చేసుకుంటూ జలపాతం వద్దకు చేరుకుని అక్కడ నీటిలో సేదతీరి తిరిగివస్తుంటారు. మంచి పిక్ నిక్ స్పాట్ గా ఇది ప్రసిద్ధి చెందింది.

ముత్యాల ధార జలపాతానికి దగ్గరలోనే కొంగల వాటర్ ఫాల్స్, బొగతా వాటర్ ఫాల్స్, ఏటూరు నాగారం వైల్ లైఫ్ శాంక్చురీ, లక్నవరం లేక్, భద్రాచలం.. తదితర టూరిస్టు ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా కవర్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications