దసరాకు కేంద్రం కానుక.. తెలంగాణాకు తొలి అమృత్ భారత్ రైలు వచ్చేసింది!
భారతదేశంలో రైల్వే విస్తరణకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం వరుసగా అనేక రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేస్తూ, కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తూ ప్రయాణికులకు సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బీహార్ నుండి ఏడు కొత్త రైళ్లను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. అందులో తెలంగాణా రాష్ట్రానికి ఒక అమృత్ భారత్ రానుంది.
ముజఫర్ పూర్ చర్లపల్లి అమృత్ భారత్ ప్రారంభించిన రైల్వే మంత్రి
మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తో పాటు, నాలుగు ప్యాసింజర్ సర్వీసులను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పాట్నా జంక్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వాసులకు ఉపయోగపడేలా ముజఫర్ పూర్ నుండి చర్లపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు.

దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసే మొట్టమొదటి అమృత్ భారత్ రైలు
అజ్మీర్ సమీపంలో దర్భంగా నుండి మదర్ జంక్షన్ వరకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ఢిల్లీలోని చాప్రా నుండి ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు ఇంకొక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. ముఖ్యంగా ముజఫర్ పూర్ నుండి చర్లపల్లికి నడిచే అమృత్ భారత్ రైలు దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసే మొట్టమొదటి అమృత్ భారత్ రైలు అవుతుంది.
ముజఫర్ పూర్ చర్లపల్లి అమృత్ భారత్ రూట్ ఇదే
హైదరాబాద్ నుండి పాట్నా, గయ తదితర ప్రాంతాలకు వెళ్ళే వారికోసం ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాల యొక్క కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ఈ రైలు దోహదం చేస్తుంది. ఈ రైలు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, నాగపూర్, గొండియా, దుర్గ్, రాయపూర్, బిలాస్పూర్, ఝార్సుగూడ, హతియా, రాంచీ, పరస్నాథ్, కోడ్మెరా, గయాజి, జహీరాబాద్, పాట్నా తదితర ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనుంది.
సాధారణ మధ్యతరగతి ప్రజల ఆదరణ పొందుతున్న అమృత్ భారత్
ఇక ఈ రైలు తో ముఖ్యంగా వలస కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ మధ్యతరగతి ప్రజల తోటి ప్రజాదరణ పొందిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు 12 సర్వీసులను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో మూడు సర్వీసులను ప్రారంభించడంతో ఈ రైళ్ల సంఖ్య 15కు చేరింది.












Click it and Unblock the Notifications