హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మలుపు: బిటెక్ విద్యార్థిని దేవి కారు ప్రమాదంలో చనిపోలేదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కారు చెట్టుకు ఢీకొట్టడంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని కె. దేవీ మరణించలేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీటెక్ విద్యార్థిని కే. దేవీ(21) మరణించినట్లు సోమవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 ట్విస్ట్: బిటెక్ విద్యార్థిని మృతి, తాగి అతను కారు నడిపాడా? ట్విస్ట్: బిటెక్ విద్యార్థిని మృతి, తాగి అతను కారు నడిపాడా?

దేవీ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని అని ఓప్రత్యక్ష సాక్షి రాము చెప్పినట్లు నమస్తే తెలంగాణ మీడియా రాసి, అతని ఫొటోను కూడా ప్రచురించింది. కాగా, దేవి మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సాక్షి మీడియా రాసింది. నమస్తే తెలంగాణ కథనం ప్రకారం - దేవీ, ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డి మధ్య గంట సేపు ఘర్షణ జరిగిందని రాము తెలిపారు. తెల్లవారుజామున 3.45 గంటలకు కారులో దేవీ, భరతసింహారెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు చెప్పారు.
భరతసింహారెడ్డి దేవీని బలవంతంగా కారులో ఎక్కించాడని పేర్కొన్నారు. ఆ సమయంలో కాపాడాలంటూ దేవీ గట్టిగా కేకలు వేసిందన్నారు. కొద్దిసేపటికి దేవీ ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించారని తెలిపారు. దేవీ, భరత్‌సింహారెడ్డి కలిసి శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో నానక్‌రాంగూడలోని ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు.

 Mystery surrounded on BTech girl student Devi's death

రాత్రి పార్టీ ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దేవీతో పాటు మరో ఇద్దరిని తన కారులో భరత్‌సింహారెడ్డి ఎక్కించుకుని జూబ్లీహిల్స్‌కు బయల్దేరాడు. అయితే వేగంగా వస్తున్న కారు హుడా కాలనీలో చెట్టుకు ఢీకొట్టిందని కథనాలు వచ్చాయి. ముందు సీట్లో కూర్చున్న దేవీ తలకు తీవ్ర గాయాలయ్యాని, ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది సేపటికే మృతి చెందిందని, భరత్‌సింహారెడ్డి స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చాయి.

కారు ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్ సీటు వద్ద ఉన్న బెలూన్ మాత్రమే తెరుచుకుంది, దాంతో భరత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని కథనాలు వచ్చాయి. ప్రమాదానికి రెండు నిమిషాల ముందే దేవి తమతో మాట్లాడిందని, ఆమె మృతిపై పోలీసులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

కారు ఢీకొట్టినట్లు చెబుతున్న చెట్టు కూడా ప్రమాదంలో ధ్వంసమైనట్లు కాకుండా ఎవరో కావాలని నరికినట్లు కనిపిస్తోందని అంటున్నారు. దేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Family members of Btech girl student Devi are suspcting fishy on her death in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X