నాగం బచావో తెలంగాణ మిషన్ యాత్ర
మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిద్రను వదిలి ప్రాజెక్టుల బాట పట్టాలని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి సూచించారు. శనివారం నాడు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర రైతుల కోసం ‘బచావో తెలంగాణ మిషన్' చేపట్టానని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
2008లో పూర్తి కావాల్సిన ఎస్‌ఎల్‌బీసీని 2018కి పొడిగించారని, ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ లేదని నాగం విమర్శించారు. టన్నెల్‌లో 10కి.మీ ప్రయాణించి పనుల పరిశీలించారు.












Click it and Unblock the Notifications