హత్యలో కొత్త కోణం: సుక్రుత్‌తో లైంగిక క్రీడను వీడియో తీసిన నాగరాజు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐఎఎస్ అధికారి ధరావత్ వెంకటేశ్వర రావు భార్య డ్రైవర్ నాగరాజు హత్య కేసులో మరో కోణం వెలుగు చూసింది. సుక్రుత్‌తో తన లైంగిక క్రీడను నాగరాజు వీడియో తీసినట్లు, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ వీడియో కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నాగరాజు సాయి కల్యాణ్ ఆపార్టుమెంట్ టెర్రాస్‌ మీద తనతో లైంగికపరమైన అసభ్యతకు పాల్పడ్డాడని, దాంతో తాను ఇటుకతో అతన్ని కొట్టానని, దానివల్ల నాగరాజు మరణించాడని సుక్రుత్ పోలీసుల వద్ద అంగీకరించాడు. డ్రైవర్‌తో తనకు లైంగిక సంబంధం ఏదీ లేదని సుక్రుత్ పోలీసు విచారణలో చెప్పాడు.

పోలీసులు సుక్రుత్‌తో పాటు ఆయన తండ్రి వెంకటేశ్వర రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వెంకటేశ్వర రావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాము సేకరించిన ఆధారాల మేరకే ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

Nagaraju shoots a video of his sexual encounter with Sukruth,

నాగరాజు శవాన్ని తరలించే పనిలో సుక్రుత్‌కు సాయం చేసేందుకు వెంకటేశ్వర రావు తన చిన్న కుమారుడు శశాంక్‌తో ఆపార్టుమెంటు వద్దకు శనివారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో శశాంక్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు. సుక్రుత్‌కు, నాగరాజుకు మధ్య లైంగిక సంబంధం ఉందా, లేదా అనే విషయాన్ని తేల్చడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As per his confession, police said Sukruth hit the victim with a brick after Nagaraju attempted to sexually abuse him on the terrace of Sai Kalyan apartments on Friday night. Nagaraju, who earlier shot a video of his sexual encounter with Sukruth, allegedly threatened to post the video on social media.
Please Wait while comments are loading...