నిండుకుండలా నాగార్జున సాగర్... 14 గేట్లు ఎత్తివేత... కనువిందు చేస్తున్న దృశ్యం...
ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ డ్యామ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ఇప్పటికే 585 అడగులకు ఆ నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ 14 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
Recommended Video
గేట్లు ఎత్తివేయడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది 20 రోజులు ముందుగానే ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకోవడం గమనార్హం. ఎగువన కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి,జూరాల,నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.

ఈసారి పశ్చిమ కనుల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో.. ఇప్పటికీ ఆల్మట్టి డ్యామ్,నారాయణపూర్ డ్యామ్‌కు భారీగా వరద పోటెత్తుతూనే ఉంది. దీంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. సాధారణంగా కృష్ణా నదికి ఈ స్థాయిలో వరద రావడం అరుదుగానే చెబుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉండటం.. ఆ స్థాయిలో నీటి లభ్యత లేక రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రాల నీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరే అవకాశం ఉంది.
అటు ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి శ్రీశైలం,నాగార్జునసాగర్,పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఆదివారం(అగస్టు 1) సాయంత్రం నాటికి 1లక్ష క్యూసెక్కులు,సోమవారం సాయంత్రం నాటికి సుమారు రూ.5లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ వరద నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.












Click it and Unblock the Notifications