వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి.. ఆ గ్రామాల్లో ముంచెత్తిన వరద; అపార పంటనష్టం!!

|
Google Oneindia TeluguNews

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ వద్ద వరద ఉధృతి బాగా పెరిగింది. వరద ఉధృతి కారణంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

నాగార్జునసాగర్ ఎడమకాలువకు గండి .. ముంచెత్తిన వరద నీరు

నాగార్జునసాగర్ ఎడమకాలువకు గండి .. ముంచెత్తిన వరద నీరు

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడటంతో, నిడమనూరు, ముప్పారం గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. వందల ఎకరాల పంట నీటమునిగింది. ఎడమ కాలువకు గండి పడటంతో ఒక్కసారిగా ముంచెత్తిన వరద తో నిడమనూరు మినీ గురుకుల హాస్టల్ లోకి వరద నీరు చేరింది. దీంతో నిడమనూరు గుంటుక గూడెం, నరసింహులు గూడెం గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు గురుకుల హాస్టల్ లో ఉన్న 87 మంది విద్యార్థులను ఒక ఫంక్షన్ హాల్ లో కి తరలించి, ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టారు.

నిడమనూరు, ముప్పారం గ్రామాలలో ఇళ్ళు జలమయం

ఇక వరద ఉధృతి కారణంగా నిడమనూరు, ముప్పారం గ్రామాలలో సుమారు 20 ఇళ్లు జలమయమయ్యాయి. మిర్యాలగూడ నుండి దేవరకొండ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఎడమ కాలువకు గండి పడిన నేపథ్యంలో, ప్రమాదాన్ని నివారించడం కోసం అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చెయ్యటాన్ని నిలిపివేశారు. అప్పటికే వస్తున్న వరదను హాలియా వద్ద దారి మళ్లించిన అధికారులు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అపార పంట నష్టం.. గండి పడి ముంపుకు గురైన గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అపార పంట నష్టం.. గండి పడి ముంపుకు గురైన గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం తీవ్ర పంట నష్టం జరగటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా, సంఘటన స్థలాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. జరిగిన పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని త్వరలో అంచనా వేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో నాగార్జునసాగర్ హాలియా నిడమనూరు మీదుగా మిర్యాలగూడ వెళ్లే మార్గాన్ని నిడమనూరు వద్ద డైవర్ట్ చేసి నల్గొండ మీదుగా మిర్యాలగూడ కు వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు.

మూడు రోజుల్లో కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేస్తాం

మూడు రోజుల్లో కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేస్తాం

కోదాడ-జడ్చర్ల హైవే (మిర్యాలగూడ-దేవరకొండ రహదారి) ప్రస్తుతం జలమయంగా ఉందని, దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్‌ సీఈ శ్రీకాంతరావు విలేకరులతో మాట్లాడుతూ కాలువకు గండి పడడంతో వెంటనే నీటి విడుదలను నిలిపివేసినట్లు తెలిపారు. వరద నీరు దాదాపు తగ్గుముఖం పట్టిందని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని, మూడు రోజుల్లో కాలువ మరమ్మతులు పూర్తి చేస్తామని సీఈ తెలిపారు.

English summary
As the left canal of Nagarjuna Sagar breached, nalgonda district nidamanuru, mupparam villages were inundated. Due to this heavy crop loss. The officials were alerted and stopped the release of water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X