కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులు యాంటీ రేబీస్ టీకా... నల్గొండలో హెల్త్ కేర్ సిబ్బంది నిర్వాకం..

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా టీకాకు బదులు రేబిస్ టీకా ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని కట్టంగూరు ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.

Recommended Video

    Hyderabad : ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన Nurse, కుప్పకూలిన యువతి || Oneindia Telugu

    వివరాల్లోకి వెళ్తే.. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పుట్ట ప్రమీల అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన లేఖతో ఈ నెల 29న వ్యాక్సిన్ వేయించుకునేందుకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. అయితే అక్కడి నర్సు ప్రమీలకు కరోనా టీకాకు బదులు రేబిస్ టీకా ఇచ్చింది. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

    nalgonda anti rabies jab to a woman instead of covid 19 vaccine

    ప్రమీల చేసిన పొరపాటే దీనికి కారణమని పీహెచ్‌సీ వైద్యాధికారి చెబుతుండగా... అక్కడి వైద్య సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రమీల ఆరోపిస్తోంది.కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని హెడ్ మాస్టర్ ఇచ్చిన లేఖను అక్కడి వైద్య సిబ్బందికి తాను చూపించానని ప్రమీల తెలిపారు. అయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా.. తనకు రేబిస్ టీకా ఇచ్చారని చెప్పారు. తన ముందున్న మహిళకు యాంటీ రేబిస్ టీకా ఇచ్చిన నర్సు... అదే సిరంజీతో తనకూ టీకా ఇచ్చారని ఆరోపించారు.ఒకే సిరంజీని ఇద్దరికి ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తే ఆ నర్సు నుంచి సమాధానం లేదన్నారు.

    మరోవైపు ప్రమీల చేసిన పొరపాటే ఇందుకు కారణమని వైద్య సిబ్బంది అంటున్నారు. పీహెచ్‌సీలో సాధారణ టీకాలు,దాని పక్కనే ఉన్న ఆయుష్ భవన్‌లో కరోనా టీకాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రమీల కోవిడ్ బ్లాక్‌లోకి కాకుండా పీహెచ్‌సీలోని రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారని తెలిపారు. దీంతో నర్సు ఆమె రేబిస్ టీకా కోసం వచ్చిందని భావించి ఆ టీకా ఇచ్చారని చెప్పారు. అయితే ఆ టీకా వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.

    గతంలో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. షమ్లీ జిల్లాలోని ఓ ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళ్లిన ముగ్గురు మహిళలకు అక్కడి వైద్య సిబ్బంది యాంటీ రేబిస్ టీకా ఇచ్చారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా మెజిస్ట్రేట్ ఆ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జిపై బదిలీ వేటు వేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+