మమ్మల్ని పట్టించుకోవట్లేదు: రేవంత్ రెడ్డిపై చంద్రబాబుకు ఫిర్యాదు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి ఓ వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆరోపించారు. బీసీలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు నేతలు విజయవాడలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నల్గొండలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో పలువురు జిల్లా బీసీ నేతలు చంద్రబాబును కలిశారు. తమకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు. కాగా, కేసీఆర్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని, రైతులను ఆదుకోవడం లేదని చెబుతూ రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు.












Click it and Unblock the Notifications