మైనర్ బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక వేధింపులు అధికంగా జరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కొంతమంది మానవ మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని ఆ చిన్నారులను మొగ్గలోనే తుంచేస్తున్నారు కొందరు. బాలబాలికల రక్షణకై కేంద్ర ప్రభుత్వం గతంలో పోక్సో చట్టం తీసుకొచ్చినా చిన్నారులపై లైంగిక వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

కొందరు మృగాల కామవాంఛలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి ఘటనకు సంబంధించిన కేసు విచారణలో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే.. దారుణంగా చిన్నారిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా రూ. లక్షా పది వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలగే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించింది. నిందితుడు చెల్లించే జరిమానా కూడా బాధిత కుటుంబానికే ఇవ్వాలని కొర్టు ఈ మేరకు తుది తీర్పు వెల్లడించింది.

ఏం జరిగింది..?

ఈ ఘటన 2013 ఏప్రిల్ 28 న నల్గొండలోని మాన్యంచెల్క హైదర్ ఖాన్ గూడలో జరిగింది. మహ్మద్ ముక్రమ్ అనే వ్యక్తి. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ఇస్మత్ ఉన్నీసా 6వ తరగతి చదువుతోంది. కుటుంబానికి అండగా ఉండేందుకు వేసవి సెలవుల్లో ఇంటింటికి తిరుగుతూ టీ పొడి అమ్ముతుంది. అలాగే మహ్మద్ ముక్రమ్ ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్లేది. దాంతో చిన్నారిపై కన్నేశాడు ఆ నీచుడు. అలా ఓసారి మైనర్ బాలికను ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చున్నీతో ఉరి వేసి చంపేశాడు. మృతదేహాన్ని తన ఇంటికి సమీపంలో ఉన్న నాలాలో పడేశాడు. ఏమీ తెలియనట్లు సైలెంట్ గా ఉన్నాడు.

అయితే టీ పొడి అమ్మేందుకు వెళ్లిన తమ కూతురు రాత్రి అవుతున్నా ఇంకా రాలేదని స్నేహితుల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో వెతికారు కుటుంబ సభ్యులు. జాడ లేకపోవడంతో ఏప్రిల్ 28న రాత్రి నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ సాయంతో నాలాలో మైనర్ బాలిక డెడ్ బాడీ దొరికింది. ఆ తర్వాత విచారణలో మహ్మద్ ముక్రమ్..మైనర్ బాలికను పలుమార్లు లైంగికంగా వేధించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అప్పటికే ముక్రమ్ పరారీలో ఉన్న నేపథ్యంలో అనుమానాలు మరింత బలపడ్డాయి.

Nalgonda POCSO Court Delivers Double Death Penalty in Brutal Rape-Murder Case of Minor

దాంతో నిందితుడు మహ్మద్ ముక్రమ్ పై 302, 201 IPC సెక్షన్లతోపాటు POCSO చట్టం 2012లోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసును విచారించిన కోర్టు.. మహ్మద్ ముక్రమ్ నేరం చేసినట్లు తేల్చింది. ఈ మేరకు అత్యాచారం చేసినందుకు ఒక ఉరి శిక్ష, హత్య చేసినందుకు మరో ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+