హైదరాబాద్- వరంగల్ ప్రయాణం గంటలోనే.. నమో భారత్ పై బిగ్ న్యూస్!

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. నమో భారత్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్లలో హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని కూడా చేర్చినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని చెప్పిన కేంద్రం దేశవ్యాప్తంగా 2900కిలోమీటర్ల మేర నిర్మించనున్న నమో భారత్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని చేర్చినట్టు చెప్పడం ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంది.

హైదరాబాద్ వరంగల్ మధ్య నమో భారత్ మార్గం

హైదరాబాద్ వరంగల్ మధ్య రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు హైదరాబాద్ వరంగల్ మధ్య నమో భారత్ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి వరంగల్ కు రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే మూడు గంటల సమయం పడుతుంది. రైలు మార్గంలో రెండు గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

Namo Bharat Regional Rapid Transit System corridor between Hyderabad and Warangal good news by center

నమో భారత్ అందుబాటులోకి వస్తే గంటలోనే ప్రయాణం

నమో భారత్ అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం ఒక గంటకు తగ్గిపోతుందని భావిస్తున్నారు. పెద్ద నగరాలను వాటి పరిసర పట్టణాలను కలిపే విధంగా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యంగా కేంద్రం చెబుతోంది. ఈ ప్రాజెక్టు కారణంగా ప్రయాణికులు యొక్క ప్రయాణ సమయం విశేషంగా ఆదా అవుతుంది.

లక్షల సంఖ్యలో ప్రజలకు లబ్ధి

వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లి వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఈ నమో భారత్ మార్గం చాలా ఉపకరిస్తుంది. ఎక్కువ సమయం పట్టకుండా, కేవలం గంటలోనే గమ్యాన్ని చేరుకునే విధంగా దీని వల్ల వీలు కలుగుతుంది. హైదరాబాద్ వరంగల్ కారిడార్ కూడా నమో భారత్ అందుబాటులోకి వస్తే లక్షల సంఖ్యలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వరంగల్ చుట్టుపక్కల పారిశ్రామిక రంగం గణనీయంగా వృద్ధి

ఈ ప్రాజెక్ట్ తో కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా, వరంగల్ చుట్టుపక్కల పారిశ్రామిక రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకుంటాయని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ పరిసరాల్లో భూముల విలువలు కూడా పెరుగుతాయని, కొత్త పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం ఉంది.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వరంగల్ హైదరాబాద్ మార్గం కీలకం

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హై స్పీడ్ రైళ్లను మూడింటిని హైదరాబాద్ మీదుగా అందించిన క్రమంలో తాజాగా నమో భారత్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఈ కారిడార్ ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వరంగల్ హైదరాబాద్ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+