వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అరెస్ట్ తప్పదా ? ముందస్తు బెయిల్ నిరాకరణ.. అజ్ఞాతంలో కొండా

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులపై దాడి చేసినందున అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. వారం రోజులుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం కొండా అజ్ఞాతంలో ఉన్నారు.

తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల .. ఒకటి కాదు రెండు గుర్తులు తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల .. ఒకటి కాదు రెండు గుర్తులు

 ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో కొండాకు ముందస్తు బెయిల్ నిరాకరించిన నాంపల్లి కోర్టు

ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో కొండాకు ముందస్తు బెయిల్ నిరాకరించిన నాంపల్లి కోర్టు

కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరరించింది. కొండా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన కోసం వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. కొండా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా , కొండా అరెస్ట్ తప్పదా అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులను నిర్బంధించిన కేసు .. అరెస్ట్ వారెంట్ జారీ

నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులను నిర్బంధించిన కేసు .. అరెస్ట్ వారెంట్ జారీ

ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు కొండా సందీప్ రెడ్డి దగ్గర రూ.10లక్షలు దొరికాయి. దీనిపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు తీసుకుని బంజారాహిల్స్ లోని కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు తమతో దురుసుగా ప్రవర్తించారని, గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని.. ఎస్ఐ, కానిస్టేబుల్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కొండాపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం నాడు నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కొండా బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

తాజా పరిణామాల నేపధ్యంలో కొండా అరెస్ట్ కు రంగం సిద్ధం చేసిన పోలీసులు

తాజా పరిణామాల నేపధ్యంలో కొండా అరెస్ట్ కు రంగం సిద్ధం చేసిన పోలీసులు

2014 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ను వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . చేవేళ్ల ఎంపీ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏగా ఉన్న ఓ వ్యక్తి నుండి భారీగా నగదును కూడ పోలీసులు ఎన్నికలకు ముందు స్వాధీనం చేసుకొన్నారు.
అయితే టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇదంతా చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏది ఏమైనా తాజా పరిణామాలతో కొండాకు అరెస్ట్ తప్పదు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

English summary
The Nampally Court rejected the Anticipatory bail petition of Congress leader Konda Vishweshwar Reddy on Thursday. As his bail petition is rejected he has to appear for an enquiry before the Banjara Hills police where a Sub- Inspector and a Head Constable filed complaints against him by alleging that he and his family members house arrested them at his house and obstructed their duties when they went to his house in Banjara Hills to serve notices to him. On the otherhand police are intensified their searches to reach him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X